నేను చూసేది అదే.. అలా అయితేనే ఒకే చేస్తా!

నటి మీనాక్షి చౌదరీ తన సినిమాల ఎంపికకు సంబంధించి పలు విషయాలను పంచుకుంది. తనకు స్క్రిప్ట్ చాలా ముఖ్యమని. కథ నచ్చితే క్యారెక్టర్ గురించి ఆలోచిస్తానని తెలిపింది. అలాగే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఆసక్తి చూపుతానని చెప్పింది.

New Update
meenakshi chowdary1

meenakshi chowdary1 Photograph: (meenakshi chowdary1)

 Meenakshi Chaudhary:  యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ టాలీవుడ్ లో ఇలా వచ్చి అలా టాలీవుడ్లో పాతుకుపోయింది. ''ఇచట వాహనములు నిలుపరాదు" అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, కళ్ల ముందే మహేష్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అంతకంటే ముందే వరుస సినిమాలకు కమిట్ అయింది. 

Also Read: ఆ లీక్డ్ ఫొటోతో ఎలాంటి సంబంధం లేదు.. నిధి ఇన్‏స్టా పోస్ట్ వైరల్!

నేను అదే చూస్తాను!

ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న మీనాక్షి, తన దగ్గరకొచ్చే కథల్లో ఏం చూస్తుంది? ఆమెకు పాత్ర ముఖ్యమా.. బ్యానర్ ముఖ్యమా? అనేదానిపై మీనాక్షి స్పందించింది. "నాకు స్క్రిప్ట్ చాలా ముఖ్యం. కథ నచ్చితే తర్వాత నా క్యారెక్టర్ గురించి ఆలోచిస్తాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఆసక్తి చూపుతాను. పిరియాడిక్ ఫిలిం మట్కాలో నాది వెరీ డిఫరెంట్ అవతార్. ఇక మొకానిక్ రాకీలో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించా. లక్కీ భాస్కర్ లో మదర్ రోల్ ప్లే చేశా. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పోలీస్ రోల్ చేస్తున్నాను. ఇవన్నీ వేటికవే ప్రత్యేకం." ఇలా తన స్టోరీ సెలక్షన్ ను బయటపెట్టింది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం తెలుగులో మీనాక్షి చౌదరి బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. తాజాగా లక్కీ భాస్కర్ తో హిట్ కొట్టిన ఈ బ్యూటీ, ఇప్పుడు వెంకీతో కలిసి సంక్రాంతి బరిలోకి వస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరుకారంతో ఫ్లాప్ అందుకున్న మీనాక్షి.. వెంకీ సినిమాతో ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తోంది.

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు