లవర్ కోసం 3 మహా సముద్రాలు దాటిన మగ తిమింగలం.. ఈ కథ వింటే మీరూ ప్రేమలో పడతారు

హంప్‌బ్యాక్ వేల్ అనే ఒక రకమైన మగ తిమింగలం తన ప్రేమ కోసం పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు 13,046 కిలోమీటర్లు ప్రయాణించిందట. ఇటీవలే శాస్త్రవేత్తలు జరిపిన ఓ పరిశోధనలో ఈ విస్తుపోయే నిజాలు తెలిశాయి.

New Update
whale (1)

whale (1) Photograph: (whale (1))

Whale Story: అదొక మగ తిమింగలం ప్రేమ కథ.. తన చుట్టూ ఎంత మంది ఉన్నా.. దాని మనసు మాత్రం ఆ ఒక్క చూపు కోసమే పరితపించిపోయేది. పడుకున్నా.. లేచినా తన జ్ఞాపకాలే.  వెచ్చనైన ఆ స్పర్శ కోసం మగ తిమింగలం ఉక్కిరిబిక్కిరి అయ్యేది. ఏదేమైనా తన చివరి మజిలీ తన ప్రేయసీ అని నిర్ణయించుకుంది. ప్రేయసిని కలవడానికి ఏకంగా మూడు మహాసముద్రాలను ఈదింది!  13,046 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది!  ఏంటి తిమిగలం తన లవర్ కోసం మూడు సముద్రాలు దాటిందా! అని ఆశ్చర్యపోతున్నారా!  అవునండి.. ఇటీవలే శాస్త్రవేత్తలు జరిపిన ఓ పరిశోధనలో ఈ విస్తుపోయే నిజాలు తెలిశాయి. అసలు ఈ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రేయసి కోసం 3 మహాసముద్రాలు.. 

శాస్త్రవేత్తల ప్రకారం.. హంప్‌బ్యాక్ వేల్ అనే ఒక రకమైన మగ తిమింగలం తన ప్రేమ కోసం పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు 8,106 మైళ్ళు (13,046 కిలోమీటర్లు) ప్రయాణించిందట. ఈ హంప్‌బ్యాక్ జాతి తిమింగలాలపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు తిమింగలం పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు ప్రయాణించడానికి కారణం తన ప్రేయసిని కనుగొనడానికి మాత్రమేనని తెలిపారు. 

ముందుగా హంప్‌బ్యాక్ వేల్ కొలంబియా నుంచి తూర్పు దిశలో వెళ్లి దక్షిణ మహాసముద్రం వైపు కదిలింది. వెళ్లే దారిలో ఈ తిమింగలం దానికి సంబంధించిన అనేక హంప్‌బ్యాక్ వేల్ సమూహాలను కూడా సందర్శించినట్లు  కనుగొన్నారు. ఇది తన ప్రేమ కోసం 13, 046 కిలోమీటర్లు ప్రయాణించి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. గతంలో 1999 నుంచి 2001 మధ్య ఒక ఆడ హంప్‌బ్యాక్ తిమింగలం బ్రెజిల్ జిల్ నుంచి మడగాస్కర్ వరకు 9800 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.

తిమింగలం ప్రయాణించినట్లు ఎలా కనుగొన్నారు.? 

అయితే 2013 నుంచి 2022 మధ్య తీసిన కొన్ని ఫోటోలను పరీశీలించడం ద్వారా ఈ ఆవిష్కరణ బయటపడింది. ఈ ఫొటోల్లో తిమింగలం రెండు వేర్వేరు ప్రదేశాల్లో కనిపించింది. మొదటగా ఒక ప్రదేశంలో కనిపించగా.. 2022 ఆగస్టు 22న అదే తిమింగలం హిందూ మహాసముద్రంలోని జాంజిబార్ ఛానెల్‌లో కనిపించింది. అలా ఈ తిమింగలం 13 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు గుర్తించారు. ఈ ప్రయాణం వెనుక ఉద్దేశ్యం తనకు తగిన ప్రేయసిని కనుగొనడం మాత్రమే అని అన్నారు. 

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు