2024లో బరాక్ ఒబామా ఫస్ట్ ఫేవరేట్ గా ఇండియన్ సినిమా! ఏంటో తెలుసా?

బరాక్‌ ఒబామా 2024లో తనకు బాగా ఇష్టమైన సినిమాలు, బుక్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ లిస్ట్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో ఒబామా ఫస్ట్ ఫేవరేట్ లో ఇండియన్ సినిమా 'All We Imagine As Light' ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

New Update
Obama favorite film

Obama favorite film Photograph: (Obama favorite film )

Barack Obama : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 2024లో తన ప్రియమైన సినిమాలు, పుస్తకాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ జాబితాను ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ జాబితాలో భారతీయ చిత్రం  'ఆల్ వీ ఇమాజిన్ యాజ్‌ లైట్' ('All We Imagine As Light') మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రాన్ని భారతీయ దర్శకురాలు పాయల్‌ కపాడియా తెరకెక్కించారు. బరాక్ ఒబామా ఇండియన్ సినిమా గురించి మాట్లాడడం  అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  ఒబామా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేసిన వెంటనే విపరీతమైన స్పందన వచ్చింది. 'All We Imagine As Light' అభినందించడం సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. 
'ఆల్‌ వీ ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌' చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ముంబై నర్సింగ్ హోమ్ పనిచేసే కేరళకు చెందిన  ఇద్దరు అమ్మాయిల చుట్టూ ఈ కథ ఉంటుంది. ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించగా  'గ్రాండ్‌ పిక్స్‌' అవార్డు గెలుచుకుంది. 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ భారతీయ చిత్రానికి ఈ అవార్డు దక్కింది.  82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులకు కూడా సినిమా ఎంపికైంది. ఈ మూవీలో కనికుశ్రుతి, దివ్య ప్రభ, చాయాకదం ప్రధాన పాత్రలు పోషించారు. 

ఒబామా ఫేవరేట్ లిస్ట్.. 

ఈ సినిమాతో పాటు ఒబామా ఫేవరేట్ లిస్ట్ లో  కాంక్లేవ్ (ఎడ్వర్డ్ బెర్గర్), ది పియానో లెసన్ (మాల్కమ్ వాషింగ్టన్), డ్యూన్: పార్ట్ 2 (డెనిస్ విల్‌న్యూ)  వంటి సినిమాలు ఉన్నాయి. 'ది యాంగ్జియస్‌ జనరేషన్‌', 'స్టోలెన్‌ ప్రైడ్‌', 'గ్రోత్‌', 'ఆర్బిటల్‌', 'ది వర్క్‌ ఆఫ్‌ ఆర్ట్‌' బుక్స్ ఇష్టమని తెలిపారు. లంచ్‌, యాయో, జంప్, ఫేవరెట్‌, యాక్టివ్‌, గోల్డ్‌ కోస్ట్‌ వంటి మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్ ఈ ఏడాది  బాగా నచ్చాయని చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు