Rashmika Engagement: విజయ్‌తో ఎంగేజ్‌మెంట్..! ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయం: రష్మిక పోస్ట్‌ వైరల్‌

విజయ్‌-రష్మిక ఎంగేజ్‌మెంట్ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రష్మిక ఒక పోస్టు పెట్టారు. తాను నటించి ‘థామ’ మూవీలోని సాంగ్ గురించి మాట్లాడుతూ.. ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. ఎలాంటి ఆలోచన లేకుండా సాంగ్ షూట్ జరిగిందని అన్నారు.

New Update

సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు(Love Marriages) సర్వ సాధారణం. షూటింగ్‌లలో పరిచయం అవడం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం.. చివరికి పెళ్లి చేసుకోవడం. ఇప్పటి వరకు చాలా మంది ఇదే కోవలో నడిచారు. ఇప్పుడు మరొక జంట కూడా అదే బాట పట్టినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా(Vijay Devarakonda - Rashmika) పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు జోరుగా సాగాయి. అందులోనూ ఈ జంట ఎప్పటికప్పుడు విదేశాల్లో ఎంజయ్ చేసిన ఫొటోలు వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 

Also Read :  ఈవారం ఓటీటీలో సందడే సందడి.. వార్2, మిరాయ్ సహా మొత్తం ఎన్నంటే?

Rashmika Thamma Movie Song 

అయితే ఈ ప్రేమ జంట గురించి రోజుకో రూమర్ బయటకొస్తున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనికి తోడు గత రెండు రోజులుగా విజయ్ - రష్మిక ఎంగేజ్‌మెంట్ న్యూస్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. విజయ్‌తో రష్మిక ఎంగేజ్మెంట్ అయిందంటూ సన్నిహిత వర్గాలు చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అతి కొద్ది మంది సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగిందని సమాచారం. 

Also Read :  లిరిక్స్‌తో ఆకట్టుకున్న ఏమి మాయ ప్రేమలోన సాంగ్.. ప్రేక్షకులను మాయలోకి దించుతున్న మ్యూజిక్

ఈ క్రమంలో తాజాగా రష్మిక మందన్న తన సోషల్ మీడియా(Social Media) లో పెట్టిన ఒక పోస్టు వైరల్‌గా మారింది. ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయం అంటూ ఆమె తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అయితే ఈ పోస్టు విజయ్‌తో ఎంగెజ్మెంట్‌(Rashmika Engagement) గురించి కాదు. ఆమె నటించిన తాజా చిత్రం గురించి పోస్టు చేసింది. రష్మిక, ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన కొత్త చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 21న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రష్మిక ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన ‘నువ్వు నా సొంతమా’ సాంగ్‌ గురించి తెలిపారు. 

ఈ సాంగ్ రూపొందడం వెనుక దర్శక నిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఈ మేరకు ఈ సాంగ్ వెనుకున్న ఆసక్తికర విషయాల్ని ఆమె పంచుకున్నారు. ఈ అందమైన ప్రదేశంలో దాదాపు 12 రోజుల పాటు షూటింగ్ చేశామని తెలిపారు. అయితే చివరి రోజు దర్శకనిర్మాతలకు ఒక ఆలోచన వచ్చిందని అన్నారు. అక్కడ అందమైన ప్రదేశాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారని.. అక్కడ ఒక సాంగ్ చేస్తే చాలా బాగుంటుందని వారు భావించినట్లు తెలిపారు. ఆ ఆలోచన అందరికీ నచ్చిందని అన్నారు. 

దీంతో దాదాపు 3 నుంచి 4 రోజులు పాటు రిహార్సిల్స్ చేసి సాంగ్‌ను షూట్ చేశామని చెప్పుకొచ్చారు. అనంతరం సాంగ్ పూర్తయ్యాక రిజల్ట్ చూసి తామంతా ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ప్లాన్ చేసిన దానికంటే ఈ విజువల్ చాలా అద్భుతంగా ఉందని చెబుతూ.. ఈ సాంగ్‌లో భాగమైన వారందరికీ అభినందనలు తెలిపారు. థియేటర్‌లో ఈ సాంగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు. 

Advertisment
తాజా కథనాలు