Dhurandhar: రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' షాకింగ్ రన్‌టైమ్.. ఎన్ని గంటలంటే..?

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ రన్‌టైమ్ 3 గంటలు 32 నిమిషాలుగా ఉంటుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది బయోపిక్ కాదని, మేజర్ మోహిత్ శర్మ కథతో సంబంధం లేదని దర్శకుడు ఆదిత్య ధర్ స్పష్టం చేశారు. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

New Update
Dhurandhar

Dhurandhar

Dhurandhar:బాలీవుడ్(bollywood) లో ప్రస్తుతం ఎక్కువగా చర్చించుకుంటున్న సినిమా ‘ధురంధర్’. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే మరో కారణంతో హాట్ టాపిక్‌గా మారింది. కారణం సినిమాకు సంబంధించిన రన్‌టైమ్ గురించి బయటకు వస్తున్న వార్తలు.

సోషల్ మీడియా మరియు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘ధురంధర్’ నిడివి మొత్తం 3 గంటలు 32 నిమిషాలు ఉండొచ్చని చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, ఇది భారతీయ సినిమాల్లో అత్యంత పొడవైన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. దీనివల్ల సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. భారీ కథ, యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు ఇలా అన్నీ ఉన్న చిత్రం కావడంతో ఈ నిడివి సరిపోతుందనే అభిప్రాయం కొందరిదీ.

ఇక మరో కోణంలో కూడా ఈ సినిమా పెద్ద చర్చకు దారితీసింది. ‘ధురంధర్’ కథ మేజర్ మోహిత్ శర్మ జీవితాన్ని ఆధారంగా చేసుకున్నదనే వార్తలు కొంతకాలంగా ట్రెండ్ అవుతున్నాయి. ఉగ్రవాదుల్లో చొరబడి, వారికి ఎదురుదాడి చేసిన వీరసైనికుడు మోహిత్ శర్మ కథ అందరినీ కదిలించింది కాబట్టి, ఈ రూమర్స్ మరింత వేగంగా పాకాయి.

Also Read :  'RX100', 'మంగళవారం'కు మించి అజయ్ భూపతి - గట్టమనేని జయకృష్ణ మూవీ.. టైటిల్ ఇదే..!

Ranveer Singh Dhurandhar Shocking Run Time

ఈ నేపథ్యంలో దర్శకుడు ఆదిత్య ధర్ స్వయంగా స్పష్టత ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.. 

“‘ధురంధర్’ ఎవరిమీదా తీసిన బయోపిక్ కాదు. మేజర్ మోహిత్ శర్మ జీవితాన్ని ఇందులో చూపించలేదు. ఆయనపై ఎప్పుడైనా బయోపిక్ తీసే అవకాశం వస్తే, ముందుగా ఆయన కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుంటాను. ఆ బయోపిక్‌ను పూర్తి గౌరవంతో తీర్చిదిద్దుతాను. దేశం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మరచిపోలేం” అని చెప్పారు. దర్శకుడి ఈ క్లారిటీతో సినిమా కథ పూర్తిగా ఫిక్షన్ ఆధారంగా ఉన్నదని స్పష్టమైంది. అయితే భారీ రన్‌టైమ్, రణ్‌వీర్ సింగ్ పాత్ర, ఆదిత్య ధర్ దర్శకత్వం కారణంగా ఈ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి.

డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ‘ధురంధర్’ నిజంగా ఈ నిడివితోనే రానుందా? కథ ఏ మలుపులు తిరుగుతుందా? అన్నది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read :  సైలెంట్ స్టార్ టూ బిలియనీర్.. ఒకే సినిమాతో కోట్లకి కోట్లు..!

Advertisment
తాజా కథనాలు