Rana Naidu 2 New Promo
Rana Naidu 2 New Promo: ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాపులర్ నెట్ ఫ్లిక్స్ సీరీస్ రానా నాయుడు సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్(Rana Naidu 2 Release Date) చేశారు. రానా దగ్గుబాటి(Rana Daggubati), వెంకటేష్(Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన ఈ సీరీస్ జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సీజన్ 2 ప్రోమో విడుదల చేశారు.
Also Read: పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఢిల్లీలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్
సీజన్ 2 ప్రోమో
యాక్షన్ సన్నివేశాలు, కొత్త పాత్రలతో సీజన్ 2 ప్రోమో ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ఈ సీజన్ లో రానా, వెంకటేష్‌లతో పాటు అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఆశిష్ విద్యార్థి వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు.
Jab baat parivaar ki ho, Rana harr line cross karega ❤️🔥
— Rana Daggubati (@RanaDaggubati) May 20, 2025
Watch Rana Naidu Season 2, out 13 June, only on Netflix.#RanaNaiduOnNetflix @VenkyMama @rampalarjun @krnx @Suparn @IncLocomotive @NetflixIndia pic.twitter.com/laB5Dv3hzE
Also Read: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా
కథలో మలుపు
సీజన్ 2 రానా తన కుటుంబం కోసం చివరిగా ఒక పని చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ అది.. అతడిని తిరిగి తన గతంలోని ఆ క్రూరమైన గ్యాంగ్ స్టార్ ప్రపంచంలోకి లాకెళ్తుంది. ఆ తర్వాత రానా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేది సీజన్ 2 కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: USA: గెట్ అవుట్...అసలెవరు నీకు జర్నలిస్ట్ ఉద్యోగం ఇచ్చారు..రిపోర్టర్ పై ట్రంప్ ఆగ్రహం
అమెరికన్ క్రైమ్ డ్రామా 'రే డొనోవన్' ఆధారంగా రానా నాయుడు సీరీస్ ని రూపొందించారు. సీజన్ 1కి సూపర్ హిట్ రెస్పాన్స్ రావడంతో సీజన్ 2 కూడా తీసుకొచ్చారు మేకర్స్. కరణ్ అషుమాన్ , సుపర్ణ్ వర్మ దీనికి దర్శకత్వం వహించారు. సుందర్ అరోన్ నిర్మించారు.
telugu-news | latest-news | cinema-news | rana-naidu-season-2 rana-daggubati | venkatesh