Miss world 2025: పొలాల నుంచి ప్రపంచ వేదిక వరకు.. మిస్ ఇండియా నందిని స్పీచ్‌కు ప్రపంచం స్టాండింగ్ ఓవేషన్!

మిస్ వరల్డ్ 2025 వేడుకలు హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈరోజు హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ లో భాగంగా మిస్ ఇండియా నందిని గుప్తా స్పీచ్ ప్రేక్షకుల మనసులను తాకింది.

New Update
miss world 2025_ nandini Gupta head to head challenge

miss world 2025_ nandini Gupta head to head challenge

మిస్ వరల్డ్ 2025 వేడుకలు హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈరోజు హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ లో భాగంగా మిస్ ఇండియా నందిని గుప్తా స్పీచ్ ప్రేక్షకుల మనసులను తాకింది.  

miss world 2025 nandini gupta pic six

భారతదేశ ఆత్మను ప్రతిబింబిస్తూ, సంస్కృతి, ఓర్పు, ఆశయాల కలయికగా ఆమె తన జీవన ప్రయాణాన్ని చక్కగా వివరించారు. తను ఒక రైతు కుమార్తెగా మొదలై, మోడల్, నటి, సామాజిక సేవా కార్యకర్తగా ఎదిగిన తన ప్రయాణం గురించి తెలిపారు. 

miss world 2025 nandini gupta pic four

“మన భారతదేశ ఆత్మ.. సంప్రదాయాల రేకల మధ్య, రేపటి కలల వైపుగా  నడుస్తుంది” అంటూ నందిని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కోటా జిల్లాలోని పసుపు పంటల మధ్య, ట్రాక్టర్ల మోతలు, కఠక్ నాట్య స్వరాల మధ్య తన బాల్యం గడిచిందని చెప్పారు. అక్కడే ఆమెకు కుటుంబ విలువలు నేర్చుకున్నారని వివరించారు.

miss world 2025 nandini gupta pic five

ఆ ఉపన్యాస వేదికపై నందిని గోల్డ్ కలర్ లెహంగా ధరించి, భారత సంప్రదాయాన్ని ఆధునికతతో మిళితం చేసిన రూపంలో మెరిసిపోయారు. ఆమె దుస్తులు నాణ్యమైన అద్దకం, కళాత్మకతతో నిండి, భారతీయ శిల్పకళను ప్రతిబింబించాయి.

miss world 2025 nandini gupta pic six

 'ప్రాజెక్ట్ ఏకతా'

నందిని 'ప్రాజెక్ట్ ఏకతా'  అనే సామజిక సేవా కార్యక్రమం ద్వారా మానసిక వైకల్యం, దివ్యంగులలో  స్ఫూర్తిని నింపుతున్నారు. "ప్రాజెక్ట్ ఏకతా". ఇది కేవలం దానం చేసే ప్రాజెక్ట్ కాదు. ఇది ఒక సంఘం – ఎలాంటి తేడాలు లేకుండా  భిన్న సామర్థ్యాలు ఉన్నవారిని గౌరవించే వేదిక అని తెలిపారు. 

miss world 2025 nandini gupta pic three
నందిని గుప్తా ఈ పోటీలో గెలవాలనుకోవడమే కాకుండా, అవకాశాలు లేనివారికి ఒక వెలుగులా ఉండాలని అంటుకుంటున్నట్లు తెలిపారు. ఆమె స్పీచ్‌కి వచ్చిన స్పందన చూస్తే, భారతదేశానికి 7 ఏళ్ల తరువాత 7వ Miss World కిరీటం వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

telugu-news | cinema-news | miss world 2025 head to head challenge | miss india Nandini gupta

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు