రామ్ చరణ్, ఉపాసన హ్యాపీ లైఫ్‌కి కారణాలు ఇవే

రామ్ చరణ్, ఉపాసనల హ్యాపీ మ్యారేజ్ సీక్రెట్ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం, డేట్ నైట్‌ అప్పుడప్పుడు చేయడమని తెలిపారు. డేట్ నైట్ అంటే ఇంట్లోనే ఉంటూ మొబైల్‌, టీవీకి దూరంగా ఉంటూ తమకు సమయం కేటాయించుకోవడం. ఈ రూల్ వల్ల మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుందని తెలిపారు.

New Update
Ram Charan Upasana

Ram Charan Upasana Photograph: (Ram Charan Upasana)

సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్, ఉపాసన వివాహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జంట ఎంతో సంతోషంగా కనిపిస్తారు. అయితే తనకు రామ్ చరణ్‌కు మధ్య ఉన్న బాండింగ్ గురించి ఉపాసన తాజాగా ఓ ఇంటర్వూలో తెలిపింది. ప్రతీ జంట ఈ రూల్‌ను పాటిస్తే తప్పకుండా వారి వివాహ బంధం కూడా బాగుంటుందని ఉపాసన ఇటీవల వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా కూడా..

ఇద్దరం ఒకే స్థాయి నుంచి వచ్చామని, పెళ్లి విషయంలో ముందే అవగాహన ఉందని ఉపాసన తెలిపింది. ఎలాంటి సమస్యలను అయినా కూడా ఎదుర్కొగలిగే శక్తి రామ్ చరణ్‌లో ఉంది. ప్రతీ విషయంలో కూడా తనని సపోర్ట్ చేస్తారని తెలిపింది. ఎంత బిజీగా ఉన్నా కూడా వారంలో ఒక రోజు అయినా ఇంట్లో డేట్ నైట్ చేస్తారట.

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

ఈ డేట్ నైట్‌లో ఇంట్లోనే ఉంటారు. అసలు మొబైల్స్, టీవీకి దూరంగా ఉంటారు. ప్రతీ బంధంలో గొడవలు అనేవి సహజం. ఇలా గొడవలు వచ్చినప్పుడు వాటిని క్లియర్ చేసుకోవాలి. పక్కన కూర్చోని మాట్లాడుకోవాలి. అప్పుడే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వివాహ బంధం హ్యాపీగా ఉంటుందని ఉపాసన తెలిపింది. 

ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు