కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గని ఎనర్జీతో వరుస సినిమాలు చేసి అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం రజినీ కాంత్ లైనప్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘జైలర్ 2’. మరొకటి ‘కూలి’. మాస్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: గుండెపోటుకు అరటిపండుతో చెక్..రోజుకు 3 తినండి
ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ సహా మరెందరో కీలక నటీ నటులు భాగం అయ్యారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.100 రోజుల్లో ఈ సినిమా విడుదల కానుందని గుర్తుచేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఇప్పుడా వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
Also Read: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!
పాన్-ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న కూలీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 కూడా అదే డేట్ లాక్ చేసుకుంది. దీంతో కూలీ- వార్ 2 బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటం విశేషం.
Also Read: ఛీ ఛీ.. అక్కవేనా నువ్వు..? సొంత చెల్లెళ్లని లవర్‌తో రేప్ చేయిస్తావా..!
రూ.40 కోట్లు డిమాండ్
కాగా కూలీ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను దక్కించుకోవడానికి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌తో ఏకంగా ఆరుగురు తెలుగు నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కూలీ తెలుగు వెర్షన్ హక్కుల కోసం మేకర్స్ రూ.40 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ డీల్ ను ఆరుగురు తెలుగు నిర్మాతలలో ఎవరు సొంతం చేసుకుంటారో త్వరలో తెలియనుంది. ఇందులో రజినీ సరసన పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: హైదరాబాద్ లేడీసా మజాకా.. బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు - కిక్కిరిసిపోయిన షాప్
rajinikanth | coolie-movie | coolie movie updates | latest-telugu-news | telugu-news