ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం "పుష్ప2". ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. కని విని రీతిలో ప్రేక్షకులు ఈ సినిమా కోసం థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం కలెక్షన్లలో కూడా ఈ చిత్రం దుమ్ము దులిపేస్తోంది. బడా బడా సినిమాల రికార్డులను నమిలి మింగేసింది. కేజీఎఫ్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, జపాన్ వంటి సినిమాల రికార్డులను వెనక్కి నెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.294 కోట్ల కలెక్షన్లతో పుష్పగాడి రూల్ మొదలు పెట్టింది. ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ అయి ఐదు రోజులు అయింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.821 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ అబ్బురపరచింది. ఇక ఐదో రోజుకు వెయ్యి కోట్లు దాటే ఛాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు. ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక! మరోవైపు ఈ సినిమా ఒక్క నేషనల్ వైడ్‌గానే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్‌గా కూడా దుమ్ము దులిపేసింది. దీంతో ఎంతో మంది ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను పలు రూమర్స్, వివాదాలు సైతం చుట్టుముట్టాయి. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై నెగిటివిటీ పెంచేందుకు ఎంతో మంది ప్రయత్నించారు. అలాగే సినిమా రిలీజ్ సమయంలో తొక్కిసలాట జరగడం, మహిళ మృతి చెందడం. ఇలా ఒక్కొక్కటి జరుగుతూ వచ్చాయి. ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సీనియర్ నటుడు నోరు పారేసుకున్నారు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే ఆ యాక్టర్.. ఇప్పుడు పుష్ప 2 మూవీపై నోరు జారారు. పుష్ప2 సినిమాపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరెవరో కాదు విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్. Senior Actor #RajendraPrasad Gaaru About #Pushpa Series 🙄🙄pic.twitter.com/gNoFXi98az — CineCorn.Com By YoungMantra (@cinecorndotcom) December 9, 2024 ఇది కూడా చూడండి: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత అల్లు అర్జున్‌పై షాకింగ్ వ్యాఖ్యలు ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించాడు. అదే విషయంపై రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు "హరికథ" అనే సినిమా ఈవెంట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కలిగియుగంలో కథలు చాలా మారిపోయాయని అన్నారు. అదే సమయంలో వాడెవడో ఎర్రచందనం దొంగ వాడు హీరో అంటూ నోరు పారేసుకున్నారు. దీంతో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలా మాట్లాడటం ఏ మాత్రం మంచిపద్ధతి కాదని కామెంట్లు పెడుతున్నారు.