samantha
Samantha: సంధ్యా థియేటర్ ఘటన కేసులో డిసెంబర్ 4న అరెస్టైన అల్లు అర్జున్ ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి అల్లు అర్జున్ ఇంటికి రాగానే కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారు. భార్య స్నేహారెడ్డి బన్నీని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన నెట్టింట తెగ వైరలైంది.
Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...
అల్లు అర్జున్, స్నేహ రెడ్డిని చూసి ఏడ్చేసిన సమంత
అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఎమోషనల్ వీడియోను చూసి నటి సమంత కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వాళ్ళిద్దరినీ అలా చూసి తాను కూడా ఎమోషనల్ అయినట్లు పోస్ట్ పెట్టింది. అల్లు అర్జున్, సమంత ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి పలు సినిమాలు కూడా చేశారు. పుష్ప1 లో సమంత అల్లు అర్జున్ సరసన స్పెషల్ సాంగ్ చేసింది.
అయితే నిన్న సాయంత్రమే బెయిల్ వచ్చినప్పటికీ.. పలు కారణాల చేత అల్లు అర్జున్ రాత్రంతా చెంచల్ గూడా జైల్లోనే ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఈరోజు ఉదయం ఆయనను వెనుక గేటు నుంచి పంపించారు.
Also Read: బన్నీని చూడగానే వెక్కి వెక్కి ఏడ్చిన భార్య, పిల్లలు!