/rtv/media/media_files/2025/05/27/A8I4IipY1CxG8ILRqaZX.jpg)
Producer Dil Raju sensational statement on Pawan Kalyan statement
సినిమా హాళ్ల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా ఓ నోట్‌ను ట్విట్టర్ వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే. దీనిపై అగ్ర నిర్మాత దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశం పై పవన్ కళ్యాణ్ ఆలోచనలకు తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానన్నారు. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఆయన అభిప్రాయం అభినందనీయం అని తెలిపారు. దీనిని మనమందరం స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!
కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి
అలాగే థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి సినిమాలు త్వరగా వెళ్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపుకు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్లాలి అనే అంశంపై మనమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత అని తెలిపారు.
Producer #DilRaju thanked AP Deputy CM Shri #PawanKalyan for his valuable suggestions towards the welfare of the Telugu Film Industry and welcomed the government’s efforts to improve theatre operations and audience experience. pic.twitter.com/fhT9G4mqx7
— TrackTollywood (@TrackTwood) May 27, 2025
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుందని.. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలసి ముందుకు సాగాలి అని అన్నారు. ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ అని.. మనమంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే, మన ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలగుతాము అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి, మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలిసికట్టుగా తోడ్పడుతాం అని ప్రకటనలో రాసుకొచ్చారు.
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
dil-raju | Pawan Kalyan | latest-telugu-news