BIG BREAKING: అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ ప్రధాన వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాటకు ఇతనే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

New Update
Allu arjun Bouncer Arrested

Allu arjun Bouncer Arrested

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ ప్రధాన వ్యక్తిగత సిబ్బంది అయిన బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని సంధ్య థియేటర్ కు తీసుకువచ్చి ఆ రోజు ఏం జరిగింది? అన్న వివరాలను రాబట్టనున్నట్లు తెలుస్తోంది. -ఆంటోనీతో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాటకు ఇతనే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులతో కూడా అంటోనీ దురుసుగా ప్రవర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 50 మందికి పైగా బౌన్సర్లతో అల్లు అర్జున్ సంధ్య థియేటర్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బౌన్సర్లు  చాలా సేపటి వరకు అల్లు అర్జున్ వద్దకు పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా పోలీసులనే కొందరు బౌన్సర్లు నెట్టేశారు.
ఇది కూడా చదవండి: మరి మీరు అలా ఎందుకు చేయలేదు? పోలీసులకు వకీల్ సాబ్ సూటి ప్రశ్నలు!

హైదరాబాద్ సీపీ సీరియస్..

ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సైతం సీరియస్ అయ్యారు. బౌన్సర్లకు వార్నిగ్ ఇచ్చారు. ఇంకో సారి యూనీఫామ్ లో ఉన్న పోలీస్ లను బౌన్సర్లు ముట్టుకున్నా ఊరుకునేది లేదన్నారు. వాళ్లే గేట్లు తెరవడం.. అందరినీ అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. బౌన్సర్లు ఏం చేసినా దానికి వారిని నియమించుకున్న వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 
ఇది కూడా చదవండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్

మరో వైపు చిక్కడపల్లి పీఎస్ లో అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు. సంధ్య థియేటర్ ఘటనపై మొత్తం 50 ప్రశ్నలను ఆయన ముందు ఉంచి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రతీ ప్రశ్నకు చాలా కాన్ఫిడెంట్ గా అల్లు అర్జున్ ఆన్సర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు