/rtv/media/media_files/2025/01/21/PAgQ5w9ZNlErI3mW4KMp.jpg)
Priyanka Chopra at Chilkur
Priyanka Chopra at Chilkur: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మంగళవారం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ చిలుకూరి బాలజీ ని దర్శించుకున్నారు. దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రియాంకా మాట్లాడుతూ.. బాలాజీ దీవెనలతో కొత్త జర్నీ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు దర్శన ఏర్పాట్లు చేసిన ఉపాసన కొణిదెలకు థ్యాంక్స్ చెప్పారు. కాగా మహేశ్ బాబు, రాజమౌళి సినిమా కోసమే ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: సంప్రదాయేతర ఇంధన రంగంలో పెట్టుబడుల ఆకర్షణ
శ్రీ బాలాజీ ఆశీస్సులతో కొత్త అధ్యాయం..
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రియాంకా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. బాలీవుడ్ తోపాటు, హాలీవుడ్ సినిమాల్లోనూ ప్రియాంక నటిస్తోంది. ఈ కారణంగా ఇటు ఇండియాకు అటు అమెరికాకు మధ్య ప్రయాణాలు కొనసాగిస్తోంది. “శ్రీ బాలాజీ ఆశీస్సులతో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మనమందరం మన హృదయాలలో శాంతి, శ్రేయస్సు, సమృద్ధిని పొందుదాం. దేవుడి దయ అనంతం. ఓం నమః నారాయణ” అని ఆమె పోస్టులో రాసుకొచ్చారు.
Also Read: సింహం బోనులోకి వెళ్లిన యువకుడు.. చివరికీ
లాస్ ఏంజెలెస్ నుంచి ప్రియాంక చోప్రా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న SSMB29 లో ప్రియాంకను హీరోయిన్‌గా తీసుకున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు నెట్టింట సర్కులేట్ అవుతున్నాయి. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్ వచ్చారని చెబుతున్నారు. ఆ సినిమాని ఉద్దేశించే కొత్త ప్రయాణమని చెప్పినట్టు పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆ సినిమాలో ప్రియాంక నటిస్తున్నట్లు మూవీ టీం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read: పేపర్ లీకులు.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ