/rtv/media/media_files/2025/01/16/missi-roti-eatt.jpeg)
భారతదేశంలోని అనేక ప్రాంతాలలో చాలా మంది ప్రజలు ఇష్టంగా తినే ఆహరం చెత్త ఆహారాల జాబితాలో చేర్చబడింది. అదేంటో కాదు మిస్సీ రోటీ ( మెంతి ఆకులతో తయారు చేస్తారు). పంజాబీ, రాజస్థాన్ ప్రదేశాల్లో దీన్ని ఎక్కువగా తింటారు.
/rtv/media/media_files/2025/01/16/missi-rotii.jpeg)
మిస్సీ రోటీ పోషకాలకు సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. అయినప్పటికీ ఇది చెత్త ఆహారాల జాబితాలో ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
/rtv/media/media_files/2025/01/16/missi-rotii-ndian-worst-foodd.jpeg)
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన టేస్ట్ అట్లాస్ వెబ్ సైట్ 2025 చెత్త ఆహార జాబితాను విడుదల చేయగా.. అందులో 100 చెత్త రేటింగ్ ఉన్న వంటకాల్లో.. మిస్సీ రోటీ 56వ స్థానంలో ఉంది. 'వరల్డ్స్ వరస్ట్ డిషెస్' జాబితాలో చేర్చబడిన ఏకైక భారతీయ వంటకం ఇదే.
/rtv/media/media_files/2025/01/16/missi-roti-chapathii.jpeg)
అసలు మిస్సీ రోటీ అంటే ఏంటి?
పంజాబ్ ట్రెడిషనల్ ఫుడ్ మిస్సీ రోటీని శెనగపిండి, మెంతికూర, కూరగాయలతో తయారు చేస్తారు. ఇది గ్లూటెన్ ఫ్రీగా ఉంటుంది. నార్త్ లోని ప్రజలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. పుష్కలమైన పోషకాలను కలిగి ఉండడంతో పాటు మిస్సీ రోటీ చాలా ఆరోగ్యకరమైనది.
/rtv/media/media_files/2025/01/16/missi-roti-indian-foodd.jpeg)
అయితే ఇంత ఆరోగ్యకరమైన మిస్సీ రోటీని చెత్త ఆహారాల జాబితాలో చేర్చడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జెల్లీ ఈల్స్, ఫ్రాగ్ ఐ సలాడ్, డెవిల్డ్ కిడ్నీలు, బ్లడ్ డంప్లింగ్స్ వంటి వింత వంటకాలతో పాటు మిస్సీ రోటీని చేర్చడం సరికాదని అంటున్నారు.
/rtv/media/media_files/2025/01/16/missi-roti-foodss.jpeg)
మిస్సీ రోటీ ప్రత్యేకత
మిస్సి రోటీ రుచికరమైన వంటకం మాత్రమే కాదు. దీనిలో అధిక మొత్తంలో ఫైబర్, ప్రోటీన్, ఇతర పోషకాలు ఉంటాయి. ఇది సాంప్రదాయ భారతీయ థాలీలో ముఖ్యమైన భాగం.
/rtv/media/media_files/2025/01/16/missi-rotit-raditional-foodd.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.