/rtv/media/media_files/2025/10/16/prabhas-fauji-2025-10-16-20-23-52.jpg)
Prabhas Fauji
Prabhas Fauji: ఇటీవల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా వచ్చిన ‘ఓజి’(OG) సినిమా పెద్ద హిట్‌గా నిలిచి, ఫ్యాన్స్‌కు మంచి ఊపు తీసుకొచ్చింది. ఈ సక్సెస్‌తో పవన్ ఫ్యాన్స్ సంతోషంగా ఉంటే, ఇప్పుడు అదే టైటిల్ సౌండింగ్ వల్ల ప్రభాస్ సినిమా టైటిల్ విషయంలో కొన్ని సందేహాలు మొదలయ్యాయి.
Also Read: ‘బాహుబలి: ది ఎపిక్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే..?
ప్రభాస్ - హను రాఘవపూడి సినిమా టైటిల్ మార్పు
ప్రస్తుతం ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read: రీ-రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంట్రా..? "బాహుబలి: ది ఎపిక్" పెద్ద ప్లానే ..!
టైటిల్ గా ‘ఫౌజి’?
ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు ‘ఫౌజి’ అనే టైటిల్ ఖరారవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇది ఆర్మీ నేపథ్యం ఉన్న సినిమాకి బాగానే సరిపోతుందని భావిస్తున్నారు. కానీ తాజాగా డ్యూడ్ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న హను రాఘవపూడి మాట్లాడుతూ “టైటిల్ అదే ఉంటుందా లేదా అనేది ఈ నెలలో తెలుస్తుంది” అని చెప్పటం కలకలం రేపింది.
Also Read: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ అప్‌డేట్స్ ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే..!
OG వల్ల ఫౌజి’కి దెబ్బ..?
పవన్ కళ్యాణ్ సినిమా ఓజి ఇటీవలే విడుదలై మంచి హిట్ అయ్యింది. దాంతో OG, ఫౌజి రెండు ఒకటే టోన్ కలిసిపోతుందనే భావన మేకర్స్‌కి కలిగిందట. అందుకే ప్రస్తుతం ఫౌజి అనే టైటిల్‌పై మళ్లీ ఆలోచన జరుగుతోందని ఫిల్మ్ నగర్ టాక్.
టైటిల్ మారుతుందా? లేదా?
మేకర్స్‌కు టైటిల్ మార్చాలనే ఆలోచన ఉన్నా, షార్ట్ టైంలో మరొక క్యాచీ టైటిల్ దొరకడం కష్టం కావచ్చు. అందుకే కొన్ని రోజులుగా చర్చలతోనే ముందుకు వెళ్తున్నారు. అయితే ఫైనల్ గా ఏ టైటిల్ ప్రకటిస్తారన్నది అక్టోబర్ 23న తెలిసే అవకాశం ఉంది.