Ticket Hikes: దీపావళి సినిమాలకు నో టికెట్ హైక్స్.. పండక్కి రచ్చ రచ్చే..!

టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల సినిమాల కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. దీపావళికి విడుదలవుతున్న నాలుగు సినిమాలు కె ర్యాంప్, డ్యూడ్, తెలుసు కదా, మిత్ర మండలి సాధారణ టికెట్ ధరలతో వస్తుండటం వల్ల మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశముంది.

New Update
Ticket Hikes

Ticket Hikes

Ticket Hikes: ఇటీవల కాలంలో సినిమా టికెట్ ధరల పెంపు సాధారణం అయిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలకైనా, మిడ్ రేంజ్ సినెమాలకైనా  మొదటి రెండు మూడు రోజులు టికెట్ హైక్ ఇచ్చేస్తున్నారు. టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కలెక్షన్లు మొదటి రెండు మూడు రోజులు ఎక్కువగా ఉండడం లేదు గణనీయంగా పడిపోతున్నాయి. మొదట్లో హైప్ కారణంగా  కొంత మంది ఫ్యాన్స్ టికెట్ రేట్లు ఎంత ఉన్నా చూసేస్తున్నారు. అయినా కానీ మిగిలిన వారు సినిమా టాక్ వచ్చాకే సినిమా చూడాలని, రేట్లు తగ్గాకే సినిమాకి వెళ్దాం అనుకుంటూ టికెట్ రేట్లు తగ్గే వరకు వెళ్లడం లేదు అందు వల్ల సినిమా రిలీజైన మొదటి రెండు మూడు రోజులు కలెక్షన్స్ పై ప్రభావం పడుతోంది అని సినిమా పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

Also Read: ‘బాహుబలి: ది ఎపిక్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్‌ ఎంతంటే..?

ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన “ఓజి” సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా, భారీ టికెట్ ధరల వల్ల మొదటి సోమవారం నుంచే కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఇదే సమయంలో తేజ సజ్జా నటించిన “మిరాయ్” సినిమా రెగ్యులర్ టికెట్ రేట్లతో రిలీజ్ అయ్యి, పెద్ద పోటీ మధ్యలోనూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టి అందరి ప్రశంసలు పొందింది. మిరై బృందం తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది అభినందిస్తున్నారు.

Also Read: రీ-రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంట్రా..? "బాహుబలి: ది ఎపిక్" పెద్ద ప్లానే ..!

సాధారణ రేట్లకే సినిమాలు..

ఇప్పుడు దీపావళి సందర్భంగా విడుదల కానున్న నాలుగు సినిమాల నిర్మాతలు అదే ఫాలో అవుతున్నారు. టికెట్ ధరలు పెంచకుండా సాధారణ రేట్లకే సినిమాలు రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది మంచి నిర్ణయం అని అనుకోవచ్చు, ఎందుకంటే పండగ సీజన్‌లో రేట్లు సాధారణంగా ఉంటే, రివ్యూలు ఎలా ఉన్నా ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ముందుకొస్తారు. మంచి టాక్ వస్తే మరింత పెద్ద కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

Also Read: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ అప్‌డేట్స్ ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే..!

ఈ దీపావళికి మూడు రోజుల వ్యవధిలో నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బరిలోకి దిగబోతున్నాయి.. కిరణ్ అబ్బవరం నటించిన K Ramp, ప్రదీప్ రంగనాథన్  Dude, సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా'(Telusu Kada), ప్రియదర్శి నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'మిత్ర మండలి'(Mithra Mandali). ఈ నాలుగు సినిమాలూ మిడ్ రేంజ్ చిత్రాలే అయినా, మంచి ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. టికెట్ ధరలు సాధారణంగా ఉండటం వల్ల ఈ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ రావొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పండగ వేళ ప్రేక్షకులకు ఇది కొంత ఊరటగా మారనుంది.

Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!

Advertisment
తాజా కథనాలు