/rtv/media/media_files/2025/09/17/prabhas-prasanth-varma-2025-09-17-08-27-04.jpg)
Prabhas - Prasanth Varma
Prabhas - Prasanth Varma: పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, ఇప్పుడు వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు ఏవి రిలీజ్ కాకపోయినా, ఆయన నటించబోయే కొత్త సినిమాల గురించి వచ్చే అప్డేట్స్ మాత్రం ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి.
Stay tune for updates!
— NEWS3PEOPLE (@news3people) September 16, 2025
[ news3people, Prasanth Varma, prabhas, hombale films ] pic.twitter.com/DtZwLHqR5U
ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న సినిమాలే కాదు, లైన్‌లో ఉన్న కొత్త ప్రాజెక్టులు కూడా టాలీవుడ్ నుంచీ బాలీవుడ్ వరకు హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో ఓ ప్రాజెక్ట్ మాత్రం ప్రత్యేకంగా ఆసక్తి రేపుతోంది. అదే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే చిత్రం.
Also Read:"మహేష్ బాబును అడగగలరా?" జర్నలిస్ట్‌పై లక్ష్మీ మాంచు ఫైర్..
ప్రశాంత్ వర్మతో ప్రభాస్..
ఈ సినిమాపై ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చాయి. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందిస్తూ, “ప్రభాస్ డేట్స్ వచ్చిన వెంటనే షూటింగ్ మొదలవుతుంది” అని క్లారిటీ ఇచ్చారు.
ఇక తాజా సమాచారం మేరకు, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. కథ, స్క్రీన్‌ప్లే, టెక్నికల్ ప్లానింగ్ అన్నీ సిద్ధంగా ఉండటంతో, ప్రభాస్ షెడ్యూల్ ఖరారవ్వగానే షూటింగ్‌ను ఆలస్యం లేకుండా ప్రారంభించేందుకు బృందం సిద్ధంగా ఉంది.
Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!
ప్రస్తుతం అభిమానులు ఎదురుచూస్తున్న ప్రశ్న మాత్రం ఒక్కటే - ప్రభాస్ డేట్స్ ఎప్పుడు వస్తాయ్? ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అని ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు.
ఇటీవల ప్రభాస్ సినిమాలు పెద్దగా రాకపోయినా, ఫ్యాన్స్‌కి మాత్రం చిన్న చిన్న ట్రీట్స్ అందుతూనే ఉన్నాయి. మిరాయ్ లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాలో గెస్ట్ రోల్, 15 నిమిషాల రుద్ర పాత్రతో సినిమాకు భారీ ఓపెనింగ్ తీసుకొచ్చారు. ఇలా ప్రభాస్ ఆయన ఫ్యాన్స్ కోసం ఇదొక ట్రీట్ ఇస్తూనే ఉన్నాడు. అలాగే రాబోయే నెలల్లో, ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే మరిన్ని అప్డేట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి.
Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?
అక్టోబర్ ప్రభాస్‌కు స్పెషల్..
ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 సందర్భంగా, 'ది రాజా సాబ్' ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక హను రాఘవపూడితో చేస్తున్న 'ఫౌజీ' ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ కూడా రావొచ్చు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ నుంచి కూడా చిన్న టీజర్ రావొచ్చని టాక్. అక్టోబర్ 31న ‘బాహుబలి – ది ఎపిక్’ కూడా థియేటర్లలోకి రాబోతోంది.
Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!
ప్రభాస్ రాబోయే సినిమాల లైన్ అప్..
ది రాజా సాబ్ (The Raja Saab)
- మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ ఎంటర్‌టైనర్
- విడుదల తేదీ: జనవరి 9, 2026.
సలార్ 2 (శౌర్యంగ పర్వం) (Salaar 2)
- బిగ్ బడ్జెట్ యాక్షన్ డ్రామా – సలార్ 1 సీక్వెల్
ఫౌజీ (Fauji)
- హను రాఘవపూడి దర్శకత్వం, కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కే సినిమా
స్పిరిట్ (Spirit)
- సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో, పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్. ఇందులో ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.
కల్కి 2898 AD సీక్వెల్ (Kalki 2)
- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే ఈ సీక్వెల్ మరో విజువల్ వండర్‌గా ఉండనుంది.
ప్రభాస్ సినిమాలు కొంచెం ఆలస్యం కావచ్చు… కానీ ఒక్కో ప్రాజెక్ట్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్‌ను కలిగిస్తున్నాయి. స్టార్ పవర్‌తో పాటు, ఆయన పాత్రలకు వచ్చే బజ్, ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్స్ ద్వారా డార్లింగ్ ప్రభాస్ ఎప్పటీకప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. రాబోయే రోజుల్లో ప్రభాస్ కొత్త సినిమాలతో థియేటర్లు షేక్ చేయడం ఖాయం!