Lakshmi Manchu: "మహేష్ బాబును అడగగలరా?" జర్నలిస్ట్‌పై లక్ష్మీ మంచు ఫైర్..

లక్ష్మీ మంచును వయస్సుకు తగ్గ వేషధారణపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నను తీవ్రంగా ఖండించారు. మహిళలపై లింగ వివక్షను ఎదురిస్తూ, స్వేచ్ఛ మనమే సంపాదించుకోవాలని తెలిపారు. మహిళల పట్ల సమాజం చూసే తీరుపై గట్టిగా స్పందించారు.

New Update
Lakshmi Manchu

Lakshmi Manchu

Lakshmi Manchu: తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న నటి లక్ష్మీ మంచు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వేషధారణపై అడిగిన ప్రశ్నలకు ఘాటుగా స్పందించారు. 47 ఏళ్ల వయస్సులో స్టైలిష్ దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారు అన్న ప్రశ్నను ఓ జర్నలిస్ట్ అడగడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు.

ఇలాంటి ప్రశ్నలు మహిళలకు మాత్రమే ఎందుకు వస్తాయని మంచు లక్ష్మీ అసంతృప్తి తెలిపారు. "మీరు ఈ ప్రశ్నను మహేష్ బాబుని(Mahesh Babu) అడిగే ధైర్యం చేయగలరా? ఆయన 50 దాటిపోతున్నాడు కదా. ఎందుకు షర్ట్ లేకుండా కనిపిస్తున్నారో అడుగుతారా?"

Also Read:రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!

ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చకు దారి తీశాయి. ఒక పురుషుడు వయసుతో సంబంధం లేకుండా స్టైల్‌గా కనిపిస్తే అందరికీ ఓ “హీరో”గా కనిపిస్తాడు. అదే ఒక మహిళ అలానే చేస్తే విమర్శలు వస్తాయి. అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.

లక్ష్మీ మాంచు మాట్లాడుతూ, మహిళలపై చాలా భారాలు ఉంటాయని చెప్పారు. వయస్సు పెరిగిన వెంటనే ఆడవారిపై సమాజం నిబంధనలు పెట్టేస్తుంది. “ఇలా ఉండొద్దు, అలా మాట్లాడొద్దు, ఇలా వేసుకోవద్దు” అని ఎన్నో నియమాలు ఉంటాయి. కానీ పురుషులకు మాత్రం అటువంటి ఆంక్షలు ఉండవు.

"ఈ స్వేచ్ఛను మనకు ఎవ్వరూ ఇస్తారు అని అనుకోవద్దు… మనమే తీసుకోవాలి" అని స్పష్టం చేశారు. అంటే, మన హక్కుల కోసం మనమే నిలబడి పోరాడాలి అనే ఉద్దేశంతో మాట్లాడారు.

Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!

ఇండస్ట్రీలో మహిళల పరిస్థితిపై వ్యాఖ్యలు

లక్ష్మీ మంచు మరో ఉదాహరణ కూడా చెప్పారు - ఒక ప్రముఖ హీరో భార్య, విడాకుల తర్వాత నటించే అవకాశాలను కోల్పోయిందని. “ఎందుకంటే ఆమె మాజీ భర్తను బాధపెడతుందని అనుకోని, సినిమాల నుంచి ఆమెను తీసేశారు” అని తెలిపారు. ఇది ఎంత బాధాకరమైన వాస్తవం అంటే, ఓ మహిళకు తన వ్యక్తిగత జీవితం కారణంగా కెరీర్‌ లో నష్టాలు రావడం అన్యాయం అని అన్నారు.

Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

విడుదలకు సిద్ధంగా కొత్త సినిమా 

లక్ష్మీ మంచు నటించిన తాజా చిత్రం “దక్ష: ఏ డెడ్‌లీ కాన్‌స్పిరసీ” సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమాలో ఆమె తండ్రి మోహన్ బాబు, అలాగే సముద్రఖని, విశ్వంత్, చిత్రా శుక్లా, సిద్ధిక్ లాంటి నటులు కూడా నటించారు.

మొత్తానికి, సమాజాన్ని నిలదీసిన లక్ష్మీ మంచు.. మహిళలపై లింగ వివక్షను నిలదీయాలి, వయస్సు ఒక పరిమితి కాదు, మహిళలు తమ స్వేచ్ఛను కోరుకోవాల్సిన అవసరం లేదు, వారు తాము కావలసినదాన్ని తమ ప్రయత్నాలతో పొందాలి, పురుషులకీ, మహిళలకీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అని చెప్పుకొచ్చారు. 

Advertisment
తాజా కథనాలు