/rtv/media/media_files/2025/09/16/peddi-updates-2025-09-16-10-19-51.jpg)
Peddi Updates
Peddi Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "పెద్ది" పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఒక విలేజ్ స్పోర్ట్స్ డ్రామా కావడం, బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించటం, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్ పనిచేయడం ఇలా అన్ని ఈ ప్రాజెక్ట్‌కి హైప్‌ను పెంచాయి.
ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ డీటెయిల్ బయటకి వచ్చింది. అదేంటంటే సినిమాలో రామ్ చరణ్ తల్లి పాత్ర కోసం నిర్మాతలు ప్రముఖ నటి విజయ్ చంద్రశేఖర్ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమె గతంలో తమిళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మామన్’ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తెలుగులో అయితే, నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘అఖండ’ సినిమాలో నటించారు.
విజయ్ చంద్రశేఖర్ పాత్ర చరణ్‌కి ఎమోషనల్ బేస్ ఇవ్వడానికే కాదు, సినిమాలోని కీలక మలుపుకు కారణమవుతోందని తెలుస్తోంది. ఆమె పాత్రకు సినిమాలో మంచి ఉందట.
ఇప్పటికే ‘పెద్ధి’ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియో, పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్ సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది. పొడవాటి జుట్టు, ముదురు గడ్డం లుక్‌లో చరణ్ మాస్ లుక్ లోకి మారిపోయారు.
Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, చరణ్ ఈ సినిమాలో మరో కొత్త మేకోవర్ కోసం సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇది కూడా ప్రత్యేకమైన లుక్ అవుతుందని, త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్.
స్టార్ కాస్ట్ & టెక్నికల్ టీమ్
ఈ సినిమా కథలో భావోద్వేగాలే కాకుండా, పల్లెటూరి బ్యాక్‌డ్రాప్, క్రీడల నేపథ్యం ఉండటం విశేషం. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?
వృద్ది సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వారు ప్రెజెంట్ చేస్తున్నారు. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ మెలోడీలు అందించనుండటంతో, మ్యూజికల్‌గా కూడ ఈ సినిమా ప్రత్యేకంగా ఉండబోతోంది.
విడుదల తేదీ ఖరారు
ఇప్పటికే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను 2026 మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, హిందీ సహా వివిధ భాషల్లో విడుదల కానుంది.
‘పెద్ధి’ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో వినూత్న ప్రయోగంగా నిలవనుంది. మాస్, క్లాస్ ఇద్దరికీ కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్న ఈ సినిమాలో విజయ్ చంద్రశేఖర్ తల్లి పాత్రలో నటించనున్నారన్న వార్త సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.