/rtv/media/media_files/2025/10/23/rajasaab-poster-2025-10-23-17-02-57.jpg)
rajasaab poster
Rajasaab: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు(Happy Birthday Prabhas) సందర్భంగా ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్ రాజాసాబ్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ మారుతి. మూవీ నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్(Prabhas RajaSaab New Poster) షేర్ చేశారు. పోస్టర్‌లో ప్రభాస్ స్టైలిష్‌గా, పండుగ వాతావరణాన్ని గుర్తుచేసే విధంగా కనిపించారు. రెబల్ స్టార్ స్టైలిష్ లుక్ వింటేజ్ ప్రభాస్ ను గుర్తుచేస్తోంది. డైరెక్టర్ మారుతి ప్రభాస్ పోస్టర్ ను పంచుకుంటూ.. బ్యూటీఫుల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. ''మై డార్లింగ్, మై రాజాసాబ్ #ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు🤗 మీరు సెట్ లో ఉంటే ప్రతిరోజూ పండగలా అనిపిస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు తెరపై ప్రభాస్ కొత్త కోణాన్ని చూస్తారు! ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అంటూ ట్వీట్ చేశారు మారుతి. దీంతో డార్లింగ్ అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యింది.
Wishing the man whose energy off screen is as magnetic as his stardom on screen, My Darling, My RajaSaab #Prabhas a very Happy Birthday 🤗🤗🙏🏻🙏🏻
— Director Maruthi (@DirectorMaruthi) October 23, 2025
Every day on #TheRajaSaab sets feels like a celebration of cinema because of you….
This Sankranthi 2026, the world will witness a… pic.twitter.com/ANNKhkOKIX
Also Read : మరో గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన అమ్మ.. ట్విన్ బేబీస్ అంటూ పోస్ట్!
వచ్చే ఏడాది విడుదల
డైరెక్టర్ మారుతీ 'రాజాసాబ్' చిత్రాన్ని హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. బాహుబలి తర్వాత ఫుల్ సీరియస్ యాక్షన్ మోడ్ సినిమాలతో అలరించిన రెబల్ స్టార్.. ఇప్పుడు 'రాజాసాబ్' లో తనలోని కామెడీ యాంగిల్ ను మళ్ళీ పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి పూర్తిచేసుకుంది. చివరిగా క్లైమాక్స్ ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్స్ లో విడుదల కానుంది. చివరిగా క్లైమాక్స్ కి సంబంధించిన ఓ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తే షూటింగ్ పనులు మొత్తం పూర్తవుతాయని తెలుస్తోంది.
ఇప్పటికే 'రాజాసాబ్' టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్ వచ్చింది. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్లో అలరించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమైంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించారు. ఇందులో ప్రభాస్ జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ కాస్ట్ సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: Pournami Re Release: 'పౌర్ణమి' సీన్ రీ క్రియేట్.. తలపై దీపం పెట్టుకుని థియేటర్లో రచ్చ రచ్చ..!