Pournami Re Release: 'పౌర్ణమి' సీన్ రీ క్రియేట్.. తలపై దీపం పెట్టుకుని థియేటర్లో రచ్చ రచ్చ..!

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ అయిన 'పౌర్ణమి' సినిమాను చూస్తూ అభిమానులు థియేటర్లలో సందడి చేస్తున్నారు. చార్మీ చేసిన “భరత వేదముగ” పాట సీన్‌ను అభిమానులు దీపాలతో రీ-క్రియేట్ చేస్తూ హంగామా చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

New Update
Pournami Re Release

Pournami Re Release

Pournami Re Release: ప్రభాస్ పుట్టిన రోజు(Prabhas Birthday) సందర్భంగా ఈరోజు రీ రిలీజైన పౌర్ణమి సినిమాను అభిమానులు థియేటర్లలో చూస్తూ సందడి చేస్తున్నారు. పౌర్ణమిలోని భరత వేదముగ పాటలో హీరోయిన్ చార్మీ రెండు చేతులలో, తలపైన  దీపం వేలిగించుకొని డాన్స్ చేసే సీన్ ను రీ క్రియేట్ చేస్తూ థియేటర్లలో హంగామా చేస్తున్నారు. ఇందుకు సంబందించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Also Read: "కేక్ కట్ చేస్తున్న బాహుబలి.. కుకింగ్ చేస్తున్న సలార్".. ఏం క్రియేటివిటీ రా అయ్యా!

Also Read: మా జీవితానికి నువ్వే గైడ్‌.. హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా! ప్రభాస్ చెల్లెలు స్పెషల్ విషెస్ - ఫోటోలు వైరల్!

4K ఫార్మాట్‌లో పౌర్ణమి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ త్రిష కలసి నటించిన ‘పౌర్ణమి’ సినిమా 2006 ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి క్లాసికల్ సినిమాగా పేరు తెచ్చుకుంది.. ఈ సినిమా కేవలం ప్రేమ కథగా కాకుండా, అద్భుతమైన క్లాసికల్ సంగీతం, నృత్యాలతో కూడిన డ్రామాగా ఆకట్టుకుంది.. ఈ స్పెషల్ మూవీ ప్రస్తుతం 4K ఫార్మాట్‌లో రీమాస్టర్డ్ అయ్యి, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23, 2025 న థియేటర్లలో మళ్లీ విడుదల అయ్యింది..

ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది.. ఇందులో ప్రభాస్ శివకేశవుడి పాత్రలో నటించి, ప్రేమ, త్యాగం వంటి విలువలను ఆధ్యాత్మికంగా చూపించాడు. త్రిష, చార్మి కూడా ముఖ్య పాత్రలు పోషించి, సినిమా భావోద్వేగాలకు బలం చేకూర్చారు.

Also Read: ప్రభాస్ 'ఫౌజీ' ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది.. థియేటర్లు దద్దరిల్లడం పక్కా..!

ఈసారి 4K ఫార్మాట్‌లో విడుదల కావడంతో, డిజిటల్ రీమాస్టరింగ్ వల్ల ప్రతి సన్నివేశం కొత్త లుక్‌తో, స్పష్టంగా, మెరుగైన విజువల్స్‌తో ప్రేక్షకులను అలరించనుంది.. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సూపర్ హిట్ గా నిలిచింది.. ప్రత్యేక ఫ్యాన్ షోలతో ఈ రిలీజ్ ప్రభాస్ పుట్టిన రోజు మరింత స్పెషల్ కానుంది..

Also Read: ప్రభాస్ బర్త్‌డే కు గీత ఆర్ట్స్ స్పెషల్ వీడియో.. గూస్‌బంప్స్ అంతే..!

ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలలో ఉన్న సినీ అభిమానులలో ‘పౌర్ణమి 4K’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఈ రీ రిలీజ్  హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో థియేటర్లలో చూసిన వారు మరల థియేటర్‌లో ఈ క్లాసిక్ సినిమాను చూడాలని ఆసక్తిగా ఉన్నారు. ఈ అక్టోబర్ 23న ‘పౌర్ణమి’ 4K రిలీజ్ తో ప్రేక్షకులు ఒకసారి మళ్లీ వింటేజ్ ప్రభాస్‌ను చూడొచ్చు. 

Advertisment
తాజా కథనాలు