Manish Gupta: ప్రముఖ డైరెక్టర్ పై పోలీస్ కేసు.. నెల జీతం కోసం డ్రైవర్ ని కత్తితో పొడిచి..!

బాలీవుడ్ దర్శకుడు మనీష్ గుప్తాపై పోలీస్ కేసు నమోదైంది. నెల జీతం విషయంలో తన కారు డ్రైవర్ లష్కర్ ని కత్తితో పొడిచిన ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటన గురువారం రాత్రి గుప్తా నివాసంలో జరిగినట్లు సమాచారం.

New Update
case filed against film maker Manish Gupta

case filed against film maker Manish Gupta

వన్ ఫ్రైడే నైట్', '420 ఐపీసీ' వంటి  సినిమాలతో గుర్తింపు పొందిన  బాలీవుడ్ డైరెక్టర్ మనీష్ గుప్తా పై పోలీస్ కేసు నమోదైంది. నెల జీతం విషయంలో వాగ్వాదం జరగడంతో తన డ్రైవర్ ఇస్లాం లష్కర్‌ ను కత్తితో పొడిచాడనే ఆరోపణలతో ఫిర్యాదు నమోదైంది. 

Also Read :  ఓవైపు కొడుకు పెళ్లి.. మరోవైపు 'కుబేర' డబ్బింగ్! కింగ్ ఫొటోలు వైరల్

డ్రైవర్ ని కత్తితో పొడిచి..!

లష్కర్ గత మూడు సంవత్సరాలుగా మనీష్ గుప్తా దగ్గర రూ. 23,000 జీతానికి  డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే  ప్రతి నెల జీతం చెల్లింపు విషయంలో జాప్యం చేస్తూ ఉన్నాడు. దీంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గత నెల జీతం కూడా చెల్లించకపోగా.. మే 30న  లష్కర్ ని విధుల నుంచి తొలగించాడు. దీంతో లష్కర్ జూన్ 3న తనకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించామని గుప్తాకి కాల్ చేశాడు. అప్పుడు గుప్తా పనిలో చేరితేనే బకాయిలు చెల్లిస్తానని అన్నాడట. ఈ మేరకు  వాటిని రాబట్టుకోవడానికి లష్కర్ మళ్ళీ పనిలో చేరాడు. అయినప్పటికీ మనీష్  డబ్బులు ఇవ్వలేదట. దీంతో శుక్రవారం రాత్రి గుప్తా నివాసంలో  వీరిద్దరికి  మళ్ళీ  వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే గుప్తా తనను కత్తితో పొడిచినట్లు లష్కర్ ఆరోపించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లక్షర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Also Read :  సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థత

Also Read :  పడుకునే ముందు శనగపిండి నీటితో ముఖం కడుక్కోండి..రిజల్ట్ చూస్తే మీరే షాక్ అవుతారు

లష్కర్ ఫిర్యాదు మేరకు వెర్సోవా పోలీసులు మనీష్ గుప్తాపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 118(2), 115(2), 352 కింద ఆయనపై కేసు నమోదు చేశారు. లష్కర్ తరపు న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్, గుప్తాను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు గుప్తా ఇవి డబ్బు గుంజడానికి చేసిన నిరాధారమైన ఆరోపణలు అని అన్నారు.  లష్కర్‌కు గతంలో క్రిమినల్ రికార్డు ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ కేసు పై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. 

Also Read: Akhil Akkineni Wedding: అఖిల్ సంగీత్ లో నాగచైతన్య, నాగార్జున రచ్చ రచ్చ! వీడియో వైరల్

 

telugu-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
తాజా కథనాలు