Kuberaa: అక్కినేని నాగార్జున తన చిన్నకుమారుడు అఖిల్ పెళ్లి పనులతో బిజీగా ఉన్నప్పటికీ.. తన అప్ కమింగ్ మూవీ 'కుబేర' డబ్బింగ్ పూర్తి చేశారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నిర్మాత పుష్కర్ రామ్ మోహన్ రావుతో కింగ్ డబ్బింగ్ స్టూడియోలో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ''కింగ్ నాగార్జున కుబేర డబ్బింగ్ పూర్తి చేశారు. జూన్ 20న ఆయన పవర్ ప్యాక్ ప్రజెన్స్ చూసేందుకు సిద్ధంగా ఉండండి'' అంటూ రాసుకొచ్చారు. ఇందులో నాగార్జున పాత్ర అనేక ట్విస్టులతో ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం.
KING @iamnagarjuna garu wraps his dubbing for #Kuberaa ✨
— Kuberaa Movie (@KuberaaTheMovie) June 7, 2025
Get ready to witness his power-packed presence from June 20th 🔥
In cinemas June 20, 2025.#SekharKammulasKuberaa#KuberaaOn20thJunepic.twitter.com/fOHwNUjxAj
జూన్ 20న విడుదల
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్- నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దక్షిణ భారతీయ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. నాగార్జున పాత్రకు అనేక మలుపులు ఉన్నట్లు సూచనలు ఉన్నాయి.
Also Read: Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్