సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శనివారం లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏపీలో సినీ రంగంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ నిర్మాత అల్లూ అరవింద్ ఆదివారం( నేడు) మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమా రాబోతున్న తరుణంలో థియేటర్లు మూస్తామనడం తప్పని అల్లు అరవింద్ అన్నారు. థియేటర్లు మూస్వామన్న నలుగురితో తనను కలపొద్దని అరవింద్ సూచించారు. డిప్యూటీ సీఎం పేషీ నుంచి రిలీజ్ అయిన లేఖను ఆయన సమర్ధించారు. ఏ వ్యాపారమైన ప్రభుత్వ సహకారం లేకుండా నడవదని నిర్మాత అరవింద్ అన్నారు.
Also read: Pawan : మీకో దండంరా బాబు.. టాలీవుడ్ పై పవన్ ఫైర్!
సినీ ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది. ఇండస్ట్రీ నుంచి వెళ్లే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని అల్లు అరవింద్ గుర్తుచేశారు. ఇండస్ట్రీ అభివృద్ధికి పవన్ కృషి చేస్తున్నారని ప్రసంశించారు. సమస్యని పరిష్కరించడానికి ఫిల్మ్ ఛాంబర్ ముందుకు రావాలని కోరారు. ఇండస్ట్రీ నుంచి ఏపీ ప్రభుత్వాన్ని ఎవ్వరూ కలువలేదని ఆయన స్పష్టం చేశారు.
Also read: Cinema News: పవన్‌పై కుట్రతోనే థియేటర్ల మూసివేత.. ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారా!?
జూన్ 1నుంచి సినిమా థియేటర్ల మూసివేత అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కుందుల దుర్గేష్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్‌పై కుట్రతోనే ఇండస్ట్రీలోని ఓ నలుగురు వ్యక్తులు ఇదంతా చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 'హరిహర వీరమల్లు' మూవీని దెబ్బతీసేందకే కుట్ర చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు.
ap-deputy-cm-pawan-kalyan | allu aravind | allu aravind shocking reaction | allu aravind press meet | telugu-industry | latest-telugu-news