/rtv/media/media_files/2025/09/22/og-postponed-2025-09-22-17-07-01.jpg)
OG Postponed
OG Postponed: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘OG’ విడుదలకు ఇంకో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రతీ సినిమా విడుదల ముందు ఓవర్సీస్ మార్కెట్‌కి సంబంధించి కొంత గందరగోళం కనిపిస్తుంటోంది. ముఖ్యంగా అమెరికా ప్రీమియర్స్(OG America Premieres) కోసం కంటెంట్ డెలివరీ చాలా లేట్ అవుతోంది. ఇదే ట్రెండ్ ఇప్పుడు 'OG' విషయంలో కూడా రిపీట్ అవుతోంది.
ఓవర్సీస్ కంటెంట్ ఏమైంది?
'OG' సినిమాకి యూఎస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకున్న ప్రత్యంగిరా సినిమాస్, ఓఫిషియల్‌గా ఓ అప్డేట్ ఇచ్చారు. అందులో వారు చెబుతున్నదాని ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ కంటెంట్, సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల సమయంలో Qube సిస్టమ్‌కి రానుంది. Qube లో దీనిని ప్రాసెస్ చేయడానికి కనీసం 6 గంటల టైం పడుతుంది. సెకండ్ హాఫ్ కంటెంట్ మాత్రం అదే రోజు రాత్రికి చేరనుందట.
#TheyCallHimOG has been delisted from Few theaters in Canada. It will be added back once the issue is resolved. If the issue is not fixed, the ticket amount will be refunded, and it could have a big impact.#PawanKalyanpic.twitter.com/D7yR5irF7E
— Milagro Movies (@MilagroMovies) September 20, 2025
అంటే, 'OG' యూఎస్ ప్రీమియర్ షోలకు కేవలం ఒక్కటిన్నర రోజు ముందు మాత్రమే కంటెంట్ పూర్తిగా అందుతోంది. ఇది అక్కడి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులకు నిజంగా టెన్షన్ విషయమే. కొన్ని కోట్లు పెట్టి రిలీజ్ చేస్తున్న ఈ సినిమాలకు కంటెంట్ చివరి నిమిషంలో రావడం లాంటివి జరుగుతుండడంతో, డిస్ట్రిబ్యూషన్ సర్కిల్‌లో ఆందోళన మొదలైంది.
Also Read : 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి గూస్ బంప్స్ అంతే!
ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇక మరోవైపు, 'OG' చిత్రబృందం తాజాగా ట్రైలర్ ను(OG Trailer) యూట్యూబ్ లో విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే ట్రైలర్ రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ, అక్కడ దాన్ని స్క్రీన్‌కి మాత్రమే పరిమితం చేశారు. ఆన్‌లైన్‌లో మాత్రం విడుదల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత రోజు రిలీజ్ చేశారు.
ఇక ఈవెంట్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ స్టేజ్‌పై కత్తితో మాస్ ఎంట్రీ ఇచ్చారు. కత్తిని తిప్పుతూ ఫ్యాన్స్‌కి అభివాదం చేశారు. వర్షం కురుస్తున్నా, ఫ్యాన్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా భారీగా వచ్చారు. స్టేడియం మొత్తం "పవన్ " పేరు మార్మోగింది. ఈ ఈవెంట్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
మూవీపై భారీ హైప్
OG చిత్రానికి సంబంధించి ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో దర్శకుడు సుజీత్, పవన్‌ను ఓ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించబోతున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, తమన్ సంగీతాన్ని అందించారు. విజువల్స్, డైలాగ్స్, ఫైట్లన్నీ ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించేలా ఉన్నాయి.
Also Read: OG: ఓజీ ప్రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ.. వైరలవుతున్న ఫొటోలు
ఓవర్సీస్ కంటెంట్ ఆలస్యం, ట్రైలర్ లేట్ గా రిలీజ్ చేయడం వంటివి 'OG' అభిమానులను కొంచెం నిరాశపరుస్తున్నా, సినిమా మీద ఉన్న బజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. విడుదలైన గంటలోనే 1 మిలియన్ వ్యూస్ తో దుమ్ము రేపుతోంది. సెప్టెంబర్ 25న థియేటర్స్‌లోకి రానున్న ఈ సినిమా, పవన్ కెరీర్‌లో మరో హై వాల్యూమ్ మాస్ ఎంటర్టైనర్ అవుతుందా చూడాలి!