/rtv/media/media_files/2025/09/22/og-premier-shows-ap-2025-09-22-21-01-42.jpg)
OG Premier Shows AP
OG Premier Shows AP: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘OG’ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పటికే సినిమా పైఅంచనాలు భారీగా పెరిగిపోయాయి, ఇక ఫ్యాన్స్‌కి మరింత హైప్ తెచ్చే వార్త వచ్చేసింది. అదేంటంటే - సెప్టెంబర్ 24 రాత్రి నుంచే OG ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం OG చిత్రానికి బెనిఫిట్ షోలు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. అయితే మొదటి షో సెప్టెంబర్ 25 తెల్లవారుజామున 1 గంటకు ప్రారంభం కావాల్సింది. కానీ ఆ షోని క్యాన్సిల్ చేసి, అంతకన్నా ముందే షో వేసుకునేందుకు అనుమతులు కావాలంటూ మూవీ టీమ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.
ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం తాజాగా కొత్త అనుమతులు ఇచ్చింది. ఇందులో పైడ్ ప్రీమియర్స్ ను సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటల నుంచే ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. అంటే, OG అభిమానులకు సినిమాను 24నే చూసే అవకాశం దక్కింది!
అయితే, తెలంగాణ ప్రభుత్వం OG చిత్రానికి సెప్టెంబర్ 24 రాత్రి నుంచే పేమిడ్ ప్రీమియర్స్ నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. అందుకోసమే OG మేకర్స్ మళ్లీ ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించి, షో టైమింగ్ ముందుకు మార్చాలని అభ్యర్థించారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/09/22/og-show-cancel-2025-09-22-21-21-42.jpeg)
బుకింగ్స్ త్వరలో ప్రారంభం ( OG Premier Shows Bookings )
ప్రస్తుతం అన్ని అధికారిక అనుమతులు పూర్తవడంతో, పేమిడ్ ప్రీమియర్ షోల బుకింగ్స్ త్వరలోనే ఓపెన్ కానున్నాయి. థియేటర్ల వద్ద ఇప్పటికే ఫ్యాన్స్ సందడి మొదలైంది. ప్రత్యేకంగా కొన్ని చోట్ల ఈ టికెట్లు రికార్డ్ ధరలకు అమ్ముడవుతున్నాయని సమాచారం.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో, పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా మెరవనున్నాడు. ఆయనకు జోడీగా ప్రియాంక మోహన్ నటించగా, విలన్‌గా ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నాడు. అలాగే, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని DVV దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ స్థాయిలో నిర్మించారు.
ఇప్పుడు ఫ్యాన్స్ కోసం OG సెప్టెంబర్ 24న రాత్రి నుంచే పైడ్ ప్రీమియర్స్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటల నుండి మొదలయ్యే షోలతో థియేటర్లు నిండనున్నాయి. పవన్ కళ్యాణ్ మ్యాజిక్‌కి మరోసారి భారీ స్థాయిలో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా జరగనుంది.