OG Censor Report: ‘OG’కు A సర్టిఫికేట్.. ఇక రికార్డులు బద్దలే..!

పవన్ కళ్యాణ్ ‘OG’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది. మాస్ ఎఫెక్ట్ తగ్గకూడదన్న ఉద్దేశంతో సెన్సార్ కట్స్‌కి అంగీకరించకుండా 'A' తీసుకున్నారు మూవీ టీమ్. మూవీ రన్‌టైం 154 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.

New Update
OG Censor Report

OG Censor Report

OG Censor Report: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘OG’ తాజాగా ట్రైలర్‌తో హంగామా చేస్తోంది. కొద్దిగంటల క్రితం విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో పవన్ లుక్స్, ఆయన స్టైల్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌ చూసినవాళ్లు "వింటేజ్ పవన్ కళ్యాణ్‌ బ్యాక్" అంటున్నారు.

సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికేట్ (A Certificate For OG)

ఇక తాజా సమాచారం మేరకు, OG సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘A’ (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే 18 ఏళ్లు దాటిన వారు మాత్రమే థియేటర్‌లో చూడడానికి అనుమతి ఉంటుంది.

ఇది పవన్ సినిమాల్లో "పంజా" తర్వాత A సర్టిఫికేట్ పొందిన రెండవ చిత్రం కావడం గమనార్హం. మొదట OG చిత్రబృందం U/A సర్టిఫికేట్ కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. కానీ సెన్సార్ బోర్డు కొన్ని కీలక సన్నివేశాలపై కట్స్ చెప్పారట. ఆ కట్స్ వల్ల కథలో ఉండే మాస్ ఎఫెక్ట్ తగ్గిపోతుందనే ఉద్దేశంతో మేకర్స్ చివరకు 'A' సర్టిఫికేట్‌నే తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

సినిమా రన్‌టైం ఎంతంటే?

OG మూవీకి 154 నిమిషాల (అంటే 2 గంటల 34 నిమిషాల) రన్‌టైమ్ ఫిక్స్ అయింది. పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో నుండి వచ్చే యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఈ రన్ టైమ్ బాగా సరిపోతుంది. 

Advertisment
తాజా కథనాలు