Allu Arjun - Atlee: లుక్కు ఊరమాస్.. అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్ ఫోటో చూశారా?

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఫోటో లీకై వైరల్‌గా మారింది. సినిమా సెట్స్ నుంచి లీకైన ఆ ఫోటోలో బన్నీ ఫుల్ హెయిర్, బ్లాక్ అండ్ రెడ్ CGI సూట్‌లో కనిపించి అంచనాలు పెంచేశాడు. ఊరమాస్ లుక్‌లో ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

New Update
AA22xA6 first look leaked photo viral

AA22xA6 first look leaked photo viral

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ‘AA22xA6’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘పుష్ప2’తో ప్రపంచ వ్యాప్తంగా ఓ ఊపు ఊపేసిన ఐకాన్ స్టార్ ఈ సారి మరింత ఫుల్ స్టామినా మూవీతో వస్తున్నాడని ఇటీవల రిలీజ్ అయిన వీడియోతో అర్థం అయింది. ఈ మూవీని లాంచ్ చేస్తూ గతంలో చిత్రబృందం ఒక పవర్ ఫుల్ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో అల్లు అర్జున్‌, అట్లీ, నిర్మాత కలిసి ఫారిన్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్స్ కంపెనీతో మాట్లాడినట్లు చూపించారు. ఆ వీడియోతో అల్లు అర్జున్, అట్లీ మూవీ ఓ రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. 

AA22xA6 Allu Arjun Leaked Photo

కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి అల్లు అర్జున్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటో లీక్ అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్, సినీ అభిమానులందరిలో ఈ ఫోటో తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈ ఫస్ట్ లుక్ ఫోటో.. అల్లు అర్జున్‌ను గతంలో ఎప్పుడూ చూడని విధంగా కొత్త అవతార్‌లో చూపిస్తుంది. 

ఈ లీక్ అయిన ఫస్ట్ లుక్ ఫోటోలో అల్లు అర్జున్ ఒక విభిన్నమైన, పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. అతని గత చిత్రాలకు భిన్నంగా ఉన్నాడు. ఫుల్ హెయిర్, బ్లాక్ అండ్ రెడ్ CGI సూట్‌లో ఉన్న లుక్ ఓ రేంజ్‌లో వైరల్‌గా మారింది. ఆ లుక్కు చూస్తుంటే అచ్చం ‘కల్కి’ మూవీలోని ప్రభాస్ లుక్కు మాదిరి కనిపిస్తోంది. ఈ ఫోటోలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‌లో ఉండటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ లుక్ అల్లు అర్జున్ సినీ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అంటున్నారు. 

దర్శకుడు అట్లీ చిత్రాలు సాధారణంగా మాస్ ఎంటర్‌టైనర్‌గా, యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటాయి. ఈ లీక్ అయిన ఫోటో బట్టి చూస్తే.. ఈ సినిమా కూడా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది. అట్లీ, విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన బిగిల్, తేరి, మెర్సల్ వంటి చిత్రాలు తమిళ సినీ పరిశ్రమలో పెద్ద హిట్ అయ్యాయి. ఇటీవల షారుఖ్ ఖాన్‌తో తీసిన జవాన్ కూడా దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు అల్లు అర్జున్‌తో అట్లీ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ ఫోటో లీక్ కావడంతో చిత్ర యూనిట్, అభిమానుల మధ్య కొంత ఆందోళన నెలకొంది. లీక్‌లు సినిమాపై అంచనాలను దెబ్బతీస్తాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ లీక్ ఫోటోతో అల్లు అర్జున్, అట్లీ కాంబోపై భారీ హైప్ క్రియేట్ అయిందని అంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు