OG Movie : ఈ ఒక్క సీన్ చాలు ఓజీకి.. ఏం తీశావయ్యా సుజీత్.. నీకు ఋణపడిపోతాం!

డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్‌ను ఒక ఫ్యాన్ బాయ్‌గా చాలా బాగా చూపించారు. ప్రతి సన్నివేశంలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్‌ని అద్భుతంగా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి పవన్ ఫ్యాన్ కాలర్ ఎగరేసేలా ఉందని అంటున్నారు.

New Update
pawan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ(OG Movie). సుజీత్ డైరెక్షన్(director sujeeth) లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్  ఓజాస్ గంభీర పాత్రలో నటించారు. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. తమన్‌ సంగీతం అందించారు. ఇమ్రాన్‌ హష్మీ, ప్రియాంక మోహన్‌, అర్జున్‌ దాస్‌, ప్రకాశ్‌రాజ్‌, శ్రియారెడ్డి, శుభలేఖ సుధాకర్‌, తేజ్‌ సప్రు, హరీశ్‌ ఉత్తమన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, అభిమన్యు సింగ్‌ తదితరులు కీలక పాత్రాలో నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం సినిమా పండగేనని చెబుతున్నారు.

Also Read :  ఇమ్రాన్‌ హష్మీ కుమ్మేశాడు. బాలీవుడ్ సరిగ్గా వాడుకోలేదు కానీ

ఒక్క ముక్కలో చెప్పాలంటే

డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్‌ను ఒక ఫ్యాన్ బాయ్‌గా చాలా బాగా చూపించారు. ప్రతి సన్నివేశంలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్‌ని అద్భుతంగా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి పవన్ ఫ్యాన్ కాలర్ ఎగరేసేలా ఉందని అంటున్నారు. మూవీలో ఒక ఫైట్ సీన్ లో ఓజాస్ గంభీర  షూకి మంట అంటుకుంటుంది. అతని నరుకుడికి బ్లడ్ వచ్చిపడితే ఆ మంట ఆరిపోద్ది. ఇలాంటి సీన్స్ ప్రతి పది నిమిషాలకోకటి సుజీత్ ప్లాన్ చేశాడని,  ఇది కదా పవన్ ఫ్యాన్స్ కోరుకునేది..ఇది కదా ఆయన ఆరా అంటే.. ఇలా కదా పవన్ కళ్యాణ్ క్రేజ్ వాడాల్సింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ OG.. మామూలు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని అభిమానులు అంటున్నారు. 

Also Read :  ఇంత పవర్ ఫుల్గా ఎవడూ చూపించలేదు భయ్యా... ఓజీ అరాచకం.. అసలు సిసలు రివ్యూ ఇదే!

Advertisment
తాజా కథనాలు