NTR-Neel: ఎన్టీఆర్- నీల్ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్.. పాన్ ఇండియా బ్యూటీ ఎంట్రీతో భారీ హైప్

#NtrNeel ప్రాజెక్ట్ లో నేషనల్ క్రష్ రష్మిక కూడా ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ .. సినిమా గ్రాఫ్‌ను మారుస్తుందని టాక్. అయితే ఈ మూవీలో మెయిన్ ఫిమేల్ లీడ్ గా రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు సమాచారం.

New Update

NTR-Neel: కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న హై యాక్షన్ ఎంటర్ టైనర్ #NtrNeel ప్రాజెక్టు పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ  అప్డేట్స్ కోసం జూనియర్ ఫ్యాన్స్  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. 

ఇందులో  కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ జోడిగా జతకట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటి రుక్మిణీ బసంత్  'సప్త సాగరదాచే ఎల్లో' చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్- నీల్ చిత్రంలో కూడా ఆమె పాత్ర చిత్రానికి ఒక ఇంటెన్స్ ఎమోషన్ ని జోడిస్తుందని, అలాగే కథకు ఊహించని మలుపు తెస్తుందని సమాచారం. అంతేకాదు కాదు మరో పాన్ ఇండియా బ్యూటీ కూడా ఇందులో భాగం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Also Read :  IPL 2025 - Delhi Captital: ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 11 కోట్ల ఆటగాడు దూరం.. కట్ చేస్తే రూ.3 కోట్లు!

Also Read :  పాకిస్తాన్ నుండి విడిపోవడం అంత ఈజీ కాదు.. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలంటే ఏం చేయాలి?

నేషనల్ క్రష్ రష్మిక

నేషనల్ క్రష్ రష్మిక కూడా ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ .. సినిమా గ్రాఫ్‌ను మారుస్తుందని టాక్. ఈ సినిమాతో రష్మిక మొదటిసారి ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. అయితే కొంతమంది రష్మిక ఐటం సాంగ్ లో కూడా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనప్పటికీ   రష్మిక ప్రజెన్స్ .. ఈ సినిమాకు మరో పాన్ ఇండియా వేటేజ్ జోడిస్తుంది. ఎందుకంటే..  పుష్ప 2, యానిమల్ తర్వాత నార్త్ లో రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా  పెరిగింది.

1996 నేపథ్యంలో బంగ్లాదేశ్ లో నివసిస్తున్న తెలుగు వలసదారుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. జూన్ 25, 2025లో విడుదల ఈ చిత్రం విడుదల కానుంది. 

Also Read :  అలేక్య చిట్టి పికిల్స్ సిస్టర్ నటిస్తున్న సినిమా ఇదే.. వీడియోలు చూశారా?

Also Read :  హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

latest-news | cinema-news | telugu-cinema-news | NTR NEEL Update 

Advertisment
Advertisment
తాజా కథనాలు