/rtv/media/media_files/2025/04/16/h2gT7psBYioYDDXTzaCt.jpg)
ntr short price
సెలబ్రెటీలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. వారు వేసుకున్న షర్ట్ లు, కాలికి తొడిగిన చెప్పులు లేదా షూస్, కళ్లకు పెట్టుకున్న సన్ గ్లాసెస్, చేతికి కట్టుకున్న వాచ్ ఇలా ప్రతీ విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ పెద్ద పెద్ద హీరోలకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు.
Also read : TG 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలపై బిగ్ అప్‌డేట్.. అది తేలితేనే ఫలితాలు !
అలాంటిదే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ షర్ట్ ధర తెలిసి అభిమానులు, నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ఏంటి భయ్యా అంత రేటా? అంటూ ఖంగుతింటున్నారు. ఓరి నాయనో అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఆ షర్ట్ ధర ఎంతో తెలుసుకుందాం.
Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కు ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. నందమూరి నటసింహం తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు జూ. ఎన్టీఆర్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అందువల్లనే ఎన్టీఆర్ కు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఆస్తులు, అంతస్తులు, బిజినెస్ వంటి విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
Also read : Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి
#JrNTR at his casual best in his latest Dubai trip
— Sashidhar Adivi (@sashidharadivi) April 16, 2025
Guess his shirt price! #ManOfMassesNTR pic.twitter.com/04bTzoYrAs
షర్ట్ ధర ఎంతంటే?
తాజాగా ఆయన వేసుకున్న షర్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఆ షర్ట్ ధర కోసం ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేసేశారు. ఆఖరికి దాని ధర తెలిసి ఖంగుతిన్నారు. ఇటీవల సినిమా షూటింగ్ లకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్.. తన ఫ్యామిలీతో దుబాయ్ వెకేషన్ కు ట్రిప్ వేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారగా.. అందులో ఎన్టీఆర్ పువ్వుల డిజైన్ తో ఉన్న బ్లూ కలర్ చొక్కా ట్రెండింగ్ లోకి వచ్చింది.
అది ఎట్రో అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందిన షర్ట్ అని తెలిసింది. ఆ షర్ట్ చూడ్డానికి సింపుల్ గానే ఉన్నా.. వెరీ కాస్ట్ లీ అని చెబుతున్నారు నెటిజన్లు. దాదాపు రూ.65 వేల నుంచి రూ.85 వేల వరకు దాని ధర ఉంటుందని సమాచారం. దీంతో ఆ షర్ట్ ధర తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
movie-news | latest-telugu-news | telugu-news