Allu Arjun-Pawan Kalyan: కలిసిపోయిన మామ- అల్లుడు.. వైరలవుతున్న ఫొటోలు

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, చిరంజీవి అత్తగారు అల్లు కనకరత్నమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే నిన్న వైజాగ్ సభలో ఉండడంతో కనకరత్నమ్మ చివరి చూపుకు రాలేకపోయిన పవన్.. ఈరోజు స్వయంగా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

New Update
allu arjun - pawan kalyan

allu arjun - pawan kalyan

Allu Arjun- Pawan kalyan:  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) తల్లి, చిరంజీవి అత్తగారు అల్లు కనకరత్నమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. కొన్ని  రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో అల్లు- మెగా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.  అయితే ఆంధ్రప్రదేశ్  డిప్యూటీ సీఎం, మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిన్న వైజాగ్  బహిరంగ సభలో బిజీగా  ఉండడంతో అల్లు కనకరత్నమ్మ చివరి చూపుకు వెళ్లలేకపోయారు. ఈమేరకు పవన్ కళ్యాణ్ సభ ముగిసిన అనంతరం స్వయంగా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

Also Read :  38 ఏళ్లకే క్యాన్సర్ తో ప్రముఖ హీరోయిన్ మృతి!

పవన్ కళ్యాణ్- అల్లు అర్జున్ 

ఆ తర్వాత అల్లు అరవింద్, అల్లు అర్జున్(Allu Arjun) కూర్చొని మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు మామ- అల్లు మళ్ళీ కలిసిపోయారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్..   పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి పార్టీ వైసీపీ నాయకుడు శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేయడం సంచలనం సృష్టించింది. దీంతో మెగా- అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి  అల్లు అర్జున్- మెగా హీరోలకు మాటల్లేవని కూడా ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేమి లేదని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో #AAA6 సినిమా చేస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇంటర్ నేషనల్ స్టాండర్స్ కూడిన వీఎఫెక్ట్స్ తో ఒక విజువల్ వండర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో బన్నీ 3 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారట.  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ నుంచి రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. 

Also Read: Allu Arjun: వైఎస్ జగన్ కి థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్.. వైరలవుతున్న ట్వీట్!

Advertisment
తాజా కథనాలు