హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్..
యష్ 'టాక్సిక్' సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీమేల్ లీడ్ గా నటించనున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అధికారికంగా ప్రకటించినప్పటికీ.. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఓబెరాయ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నయన్ ఈ సినిమాలో భాగం కానున్నట్లు ధృవీకరించారు. అక్షయ్ ఓబెరాయ్ కూడా టాక్సిక్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే నయన్ యష్ కి అక్క పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటి కరీనా కపూర్ ని అనుకున్నారట. ఈ సినిమా కోసం నయన్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
CONFIRMED Nayanthara is a part of Yash-led ‘Toxic#Nayanthara #Yash
— NayanAnu (@AnuNayanFan) January 23, 2025
Akshay Oberoi About #TOXICTheMoviepic.twitter.com/HCs0HlT1ND
Also Read: Kurchi Madathapetti: 'కుర్చీ మడతపెట్టి' పాటకు యమ క్రేజ్.. నేపాల్ వీధుల్లో దుమ్మురేపిన అమ్మాయిలు! వీడియో వైరల్
టాక్సిక్ చిత్రంలో కియారా అడ్వానీ, తార సుతారియా, శృతి హాసన్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల చేత వాయిదా పడింది. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ, రాకింగ్ స్టార్ యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!