Prabhas : ప్రభాస్ తో మృణాల్ ఠాకూర్ రొమాన్స్..!

'స్పిరిట్' మూవీలో ప్రభాస్ కి జంటగా 'సీతారామం' మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు సమాచారం. మొదటగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన ని తీసుకోవాలనుకున్నప్పటికీ డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో మృణాల్ ఠాకూర్ ని ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
prabhas

‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ‘స్పిరిట్’ అనే మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే. డార్లింగ్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలన్నింటిలో ఈ మూవీపైనే విపరీతమైన హైప్ ఉంది. ఇందులో ప్రభాస్‌ ను ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడని విధంగా చూపించబోతున్నారు. 

Also Read :  Jogi Ramesh: వైసీపీకి మరో బిగ్ షాక్.. జోగి రమేష్ జంప్

డార్లింగ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్న సినిమా కూడా ఇదే కావడంతో 'స్పిరిట్' అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. లేటెస్ట్ ఫిలిం నగర్ టాక్ ప్రకారం.. 'స్పిరిట్' లో ప్రభాస్ కి జంటగా 'సీతారామం' మూవీ  ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు సమాచారం.

మృణాల్ ఫైనల్..

అయితే మొదటగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన ని తీసుకోవాలనుకున్నప్పటికీ డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో మృణాల్ ఠాకూర్ ని ఫైనల్  చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి మృణాల్ ఠాకూర్.. హను రాఘవపూడి - ప్రభాస్ కాంబో మూవీలోనే నటించాలి. కానీ అందులో మిస్ అయినా..చివరికి 'స్పిరిట్' లో డార్లింగ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. 

Also Read :  పొట్టి శ్రీరాములు పేరుతో త్వరలో తెలుగు యూనివర్సిటీ

త్వరలోనే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. టి-సీరిస్ బ్యానర్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై సందీప్ రెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. 

Also Read: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు