నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు! నేటితో ‘బిగ్ బాస్-8’ షో ముగింపు పలకనుంది. విజేతను ఇవాళ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పశ్చిమ మండల పోలీసులు నిర్ణయించారు. By Seetha Ram 15 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షోలలో ‘బిగ్ బాస్’ షో ఒకటి. ఎంతో మంది ఈ షో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్ వంటి భాషల్లో సైతం బిగ్ షోకు ఫుల్ క్రేజ్ ఉంది.\ Also Read: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..! ఇక తెలుగు విషయానికొస్తే.. ఇప్పటికే బిగ్ బాస్ రియాల్టీ షో దిగ్విజయంగా 7 సీజన్లు పూర్తి చేసుకుంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా తనదైన శైలిలో ఆడియన్స్‌ను అలరిస్తూ బాగా ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చారు. ఇక ఈ ఏడాది సీజన్ 8 ప్రారంభమైంది. ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ సీజన్‌లో పెద్దగా తెలిసిన ముఖాలేవి కనిపించలేదు. Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ... దీంతో ప్రారంభమైన మొదట్లో అంతగా ఎవరూ ఆసక్తి చూపించలేదు. కానీ మెల్ల మెల్లగా రోజులు గడుస్తున్న కొద్ది ఒక్కో కంటెస్టెంట్‌కు ఆడియన్స్ ఫ్యాన్స్ అయిపోయారు. అలా ఇప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్‌లలో నిఖిల్‌కు అత్యంత ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే నబీల్, ప్రేరణకు కూడా ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. చూడ్డానికి కొత్త ముఖాలే అయినా వారి టాస్క్‌లు, గేమ్ ప్లానింగ్ వంటి వాటితో బాగా పాపులర్ అయ్యారు. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 5 మంది మాత్రమే ఉన్నారు. నిఖిల్, నబీల్, గౌతమ్, అవినాష్, ప్రేరణ ఉన్నారు. ఇవాళతో ఈ షో ముగింపు పలకనుంది. Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ... నేడే విజేత ప్రకటన దీంతో ఈ షోలో విన్నర్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకరేమో నిఖిల్ విన్నర్ అంటూ చెబుతున్నారు. రన్నరప్‌లో గౌతమ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంత వరకు నిజం ఉందో తెలీదు. ఇవాళ్టితో దానికి శుభం కార్డు పలకనున్నారు. విజేతను ఇవాళ (ఆదివారం) ప్రకటించనున్నారు. సీజన్ 8 ముగింపు నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు 300 మంది పోలీసులతో భద్రత దాదాపు 300 మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తూ పశ్చిమ మండల పోలీసులు నిర్ణయించారు. దీనికి కారణం గతేడాది జరిగిన ఇన్సిడెంటే అని చెప్పాలి. గతేడాది పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత స్టూడియో నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అభిమానుల అత్యుత్సాహంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఈ సారి అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. #big boss 8 final day #bigg-boss-8 #bigg-boss #bigg-boss-telugu-8 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి