/rtv/media/media_files/2025/11/22/varanasi-songs-2025-11-22-13-06-43.jpg)
Varanasi Songs
Varanasi Songs: సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) - రాజమౌళి(Rajamouli) కలయికలో వస్తున్న వారణాసి సినిమా మీద రోజు రోజుకీ హైప్ పెరుగుతోంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాపై ఒక ఆసక్తికరమైన మ్యూజిక్ అప్‌డేట్ షేర్ చేశారు.
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కార్యక్రమంలో పాల్గొన్న కీరవాణి, వారణాసి సంగీతం గురించి మాట్లాడారు.
“ఈ సినిమాలో అభిమానులు ఊహించని రేంజ్‌లో మ్యూజిక్ వింటారు. ప్రస్తుతం ఎక్కువగా చెప్పలేను కానీ, వారణాసిలో మొత్తం ఆరు పాటలు ఉంటాయి,” అని కీరవాణి తెలిపారు.
Also Read: 'ఇలా చేస్తే పైరసీ పూర్తిగా ఆపేయొచ్చు'.. ఆర్జీవీ చెప్పిన సొల్యూషన్!
అలాగే తాను ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా పూర్తిగా క్లియర్‌గా ఉన్నానని చెప్పారు. “మనకు చేసే పనిపై నమ్మకం ఉంటే ఒత్తిడి అనేది ఉండదు. వారణాసి విషయంలో కూడా నాకు 100% క్లారిటీ ఉంది,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన ‘రణ కుంభ’ ఆడియో సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. రాజమౌళి - కీరవాణి కాంబినేషన్ అంటే ఎప్పుడూ మ్యాజిక్ హైలైట్ అవుతోంది అనే విషయం అందరికీ తెలుసు. వీరిద్దరి కాంబోలో వచ్చిన మగధీర, ఈగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ పాటలు నేటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నాటు నాటు పాట ఆస్కార్ తెచ్చి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
Also Read: కీరవాణి భారీ మ్యూజికల్ అప్‌డేట్ - ‘వారణాసి’లో మొత్తం ఎన్ని పాటలంటే?
వారణాసి బడ్జెట్
ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో ఆసక్తికర విషయం హీట్ అవుతోంది. వారణాసిలో భారతదేశం నుంచే కాక ఇతర భాషల టాప్ స్టార్లు కూడా నటిస్తున్నారని టాక్. వీరి పారితోషికాలతో కలిసి సినిమా బడ్జెట్ భారీగా పెరిగిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
Also Read: "ఈ రెబల్ సాబ్ యూట్యూబ్ ని షేక్ చేస్తాడు" తమన్ గూస్ బంప్స్ ఎలివేషన్!
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ. 1100 కోట్లు అని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే, వారణాసి భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది.
రిలీజ్ ఎప్పుడు?
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్ 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow Us