RGV on Piracy Issue: 'ఇలా చేస్తే పైరసీ పూర్తిగా ఆపేయొచ్చు'.. ఆర్జీవీ చెప్పిన సొల్యూషన్!

ఆర్జీవీ పైరసీ అసలు ఆగదని, కారణం పైరసీ సినిమాలు చూసే జనమేనని చెప్పుకొచ్చారు. సప్లయర్‌తో పాటు పైరసీ చూస్తున్న వారినీ శిక్షించాలి, 100 మందిని అరెస్ట్ చేసి పేర్లు బయటపెడితేనే పైరసీ తగ్గుతుందని సూచించాడు. రాబిన్ హుడ్ లాజిక్‌ కూడా తప్పు అని ట్రోల్ చేసారు RGV.

New Update
RGV Piracy

RGV on Piracy Issue

RGV on Piracy Issue: సినిమా పైరసీ సమస్య ఎప్పటినుండో సినిమా ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పే. ఈ విషయంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి తన స్టయిల్‌లో స్పందించాడు. తాజాగా సోషల్ మీడియాలో పైరసీపై తన ఆలోచనలు పంచుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ఆర్జీవీ ఏమంటాడంటే…

పైరసీ ఎప్పటికీ ఆగదట! కారణం టెక్నాలజీ కాదు, పోలీసింగ్ బలహీనత కూడా కాదు. అసలు కారణం పైరసీ సినిమాలు చూసే పెద్ద సంఖ్యలో జనమే. వాళ్లు ఉన్నంతకాలం పైరసీ సప్లై చేసే “రవి లాంటి వారు” కూడా ఉంటారట.

కొంతమంది రవిని 'రాబిన్ హుడ్'తో పోల్చడంపై ఆర్జీవీ సెటైర్లు కూడా వేశాడు. నేటి ప్రమాణాల ప్రకారం రాబిన్ హుడ్ హీరో కాదు, ప్రమాదకరమైన నేరస్థుడు అని చెప్పాడు. “ధనికుల వద్ద నుంచి దోచుకుని పేదలకు ఇవ్వడం ఎలా సరైందయ్యా? ధనవంతుడు కావడం నేరమా?” అని ప్రశ్నించాడు.

పైరసీకి జనం ఎందుకు అలవాటు పడుతున్నారు?

ఆర్జీవీ మాటల్లో - సినిమా ఖర్చయినందుకు కాదు, అతి పెద్ద ‘మోరల్ ఫిలాసఫీ’ కాదు. సింపుల్‌గా  వీక్షించడానికి సౌకర్యంగా ఉంటుంది, ఉచితం కాబట్టి చూస్తారు అంతే. ఇండస్ట్రీలోని చాలా మంది కూడా పైరసీ చూస్తారని, దానికి కారణం డబ్బు, టైం సేవ్ చేసుకోవడమేనని చెప్పాడు.

అంతేకాదు… “సినిమా చూడటం ఖరీదుగా ఉంది కాబట్టి పైరసీ కరెక్ట్” అని వాదించే వాళ్లను ఆర్జీవీ ట్రోల్ చేశాడు. అలాంటి లాజిక్ అయితే, బీఎండబ్ల్యూ షోరూమ్ దోపిడీ చేసి పేదలకు కార్లు పంచాలని కూడా మీరు చెప్పాలి కదా?” అని సెటైర్ వేశాడు.

పైరసీని నిజంగా ఎలా ఆపాలో ఆర్జీవీ చెప్పిన ‘ఫైనల్ సొల్యూషన్’ సాధారణంగా అందరూ పైరసీని సప్లై చేసే వారిని మాత్రమే శిక్షించాలని మాట్లాడతారు. కానీ ఆర్జీవీ మాత్రం ఇలా అన్నాడు:

పైరసీ చేసేవాడితో పాటు - పిరసీ చూస్తున్న ప్రేక్షకుడినీ శిక్షించాలి. ఎందుకంటే పైరసీ సప్లయర్‌ను పట్టుకోవడం కష్టం. కాని పైరసీ చూసే వాళ్లను పట్టుకోవడం చాలా తేలిక. 100 మంది పైరసీ చూస్తున్న వాళ్లను అరెస్ట్ చేసి, వారి పేర్లు పబ్లిక్‌గా పెట్టాలి. ఇలా చేస్తేనే పైరసీపై భయం పెరుగుతుందని ఆర్జీవీ అభిప్రాయం.

ఆర్జీవీ స్టయిల్‌లో ఇచ్చిన ఈ అసలైన సొల్యూషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు