/rtv/media/media_files/2025/11/22/raja-saab-first-single-2025-11-22-10-43-27.jpg)
Raja Saab First Single
Raja Saab First Single: డార్లింగ్ ప్రభాస్(Prabhas) అభిమానులు ఒక బిగ్ ట్రైట్ కోసం సిద్ధంగా ఉండాలి! డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్-కామెడీ-థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ నుంచి ఫస్ట్ సాంగ్ రెబల్ సాబ్ త్వరలో రిలీజ్ కాబోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా ఈ పాట గురించి ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ ఒక వీడియోలో మాట్లాడారు.
Also Read: మోక్షజ్ఞ 'ఆదిత్య 999'పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన బాలయ్య..!
A vintage showcase of #Prabhas set in the musical vibe of @MusicThaman ready to stun you all on Nov 23rd 💥
— Shreyas Media (@shreyasgroup) November 22, 2025
Join Us For Exclusive Updates 🔗 https://t.co/BZ8FdWEL3k#TheRajaSaabOnJan9th#Prabhas#DirectorMaruthi#Thaman#ShreyasGroup#ShreyasMediapic.twitter.com/B6FRVlbytI
'రెబల్ సాబ్'తో యూట్యూబ్ షేక్ కావడం ఖాయం
తమన్ మాట్లాడుతూ, రెబల్ సాబ్ సాంగ్ సోషల్ మీడియాను మొత్తం షేక్ చేయబోతోంది. 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేయబోతోందని ఆయన పేర్కొన్నారు. "మొత్తానికి రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రెడీ అయిపోయింది. ఇంకొక రోజు ఓపిక పడితే రేపు ప్రోమో, ఎల్లుండి ఫుల్ లిరికల్ వీడియో చూస్తారు. అసలు మామూలుగా ఉండదు," అంటూ తమన్ తెలిపారు.
Also Read: "నా తమ్ముడి గెటప్ కాపీ కొట్టా.." 'అఖండ 2' ట్రైలర్ లాంచ్ లో బాలయ్య సందడి.
సాంగ్ పోస్టర్ విడుదల
డైరెక్టర్ మారుతి కూడా ఫస్ట్ సింగిల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మిమ్మల్ని 2000 కాలం నాటి డార్లింగ్ యుగానికి తీసుకెళ్ళే పాట రాబోతుంది" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుక్, స్టైల్ ఫ్యాన్స్‌కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. పోస్టర్ చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్స్ చేస్తున్నారు. నవంబర్ 23న రెబల్ సాబ్ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో రిలీజ్ అవుతుంది. అభిమానులు ఈ పాటలో ప్రభాస్ డాన్స్ మూవ్స్ ని మళ్లీ చూడనున్నారు.
Also Read: వెట్రిమారన్ ట్రెండ్.. సోషల్ మీడియాలో దర్శకుడు వైరల్..!
ప్రభాస్ ఫ్యాన్స్ సాంగ్ కోసం ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం ప్రారంభించారు. మారుతీ అన్నట్టు పాట ప్రేక్షకులను 2000ల డార్లింగ్ ప్రభాస్ యుగానికి తీసుకెళ్ళబోతున్నాయి. రెబల్ సాబ్ ఫస్ట్ సింగిల్ ద్వారా ‘ది రాజా సాబ్’పై కొత్త హైప్ ఏర్పడింది.
‘ది రాజా సాబ్’ ఫస్ట్ సాంగ్ రెబల్ సాబ్ నవంబర్ 23న రిలీజ్ అవుతోంది. ప్రభాస్ లుక్, స్టైల్, తమన్ మ్యూజిక్ అన్ని కలిసిన ఈ పాట అభిమానుల మనసులను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఫ్యాన్స్‌కి ఇది ఒక పండగ అని చెప్పొచ్చు.
Follow Us