/rtv/media/media_files/2025/02/03/AciNeqUTso9wNZ0bAXfY.jpg)
Mastan Sai 300 secret videos hard disk handover to police by Lavanya
Masthan Sai Arrest: హీరో రాజ్ తరుణ్(Hero Raj Tharun), లావణ్య(Lavanya), మస్తాన్ సాయి(Masthan Sai).. ఈ మూడు పేర్లు అందరికీ గుర్తుండే ఉంటుంది. గతేడాది వీళ్ల ముగ్గురు పేర్లు వార్తల్లో నిలిచాయి. సోషల్ మీడియాలో సైతం రచ్చకెక్కాయి. గతేడాది మొత్తం వార్తల్లో వీరి ఎపిసోడ్స్ నడిచాయి. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ, ప్రేమ పేరుతో తనను వాడుకుని వదిలేశాడంటూ లావణ్య తీవ్ర ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అందులో మస్తాన్ సాయి పేరుకూడా అప్పట్లో గట్టిగా వినిపించింది.
మరోసారి తెరపైకి వివాదం
అయితే తాజాగా మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి రాజ్ తరుణ్ విషయంలో కాదు. మస్తాన్ సాయి విషయంలో లావణ్య నోరు విప్పింది. అతడి వద్ద ఏకంగా 300 న్యూ*డ్ వీడియోలు ఉన్నాయంటూ మస్తాన్ సాయి బండారాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట
అంతేకాకుండా మస్తాన్ సాయి చేసిన దురాగతాలన్నింటిని ఆమె బట్టబయలు చేసింది. అతడిని అరెస్ట్ చేయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మస్తాన్ సాయి, లావణ్య గతంలో వరలక్ష్మి టిఫిన్స్ కేసులో డ్రగ్స్ విషయమై అరెస్ట్ అయ్యారు. అనంతరం బయటకు వచ్చారు. అయితే ఈ కేసులో ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మస్తాన్ సాయి రికార్డు చేసుకున్నట్లు సమాచారం.
Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం
హార్డ్ డిస్క్‌లో 300 వీడియోలు
అలా దాదాపు 300 వీడియోలను మస్తాన్ సాయి ఒక హార్డ్ డిస్క్‌లో దాచగా.. ఆ హార్డ్ డిస్క్‌ను లావణ్య తాజాగా పోలీసులకు అప్పగించింది. అతడ్ని అరెస్టు చేయించింది. తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసిన లావణ్య.. హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అందించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Also Read: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు