Manchu Laxmi: వాళ్లు ఓవర్ యాక్షన్ చేశారంటూ.. మంచు లక్ష్మి ఫైర్

ఇండిగో విమానయాన సంస్థ ప్రవర్తించిన తీరుపై మంచు లక్ష్మి మండిపడ్డారు. సంస్థ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, లగేజ్ బ్యాగ్‌ను పక్కకు తోసేయడంతో పాటు కనీసం సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక రకమైన వేధింపు మండిపడ్డారు.

New Update
నా డబ్బు నాఇష్టం, నీకేంటి నొప్పి-మంచు లక్ష్మి

Manchu Laxmi

మంచు లక్ష్మి ఇండిగో విమానయాన సంస్థ ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. ఈ సంస్థలోని సిబ్బంది ప్రయాణికులతో ప్రేమగా ఉండరని, దురుసుగా ప్రవర్తించారని ఆమె సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

సిబ్బంది దురుసుగా వ్యవహరించారని..

ఇటీవల మంచు లక్ష్మి ఇండిగో సంస్థకి చెందిన విమానంలో ప్రయాణించారు. ఈ సమయంలో ఆమె లగేజ్ బ్యాగ్‌ను పక్కకు తోసేయడంతో పాటు దాన్ని ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదని ఆమె తెలిపారు. సంస్థ సిబ్బంది చెప్పినట్లు చేయకపోతే సిబ్బంది దురుసుగా వ్యవహరించారని ఆమె అన్నారు.

ఇది కూడా చూడండి:Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

కనీసం తన బ్యాగ్‌కి సెక్యూరిటీ ట్యాగ్ వేయలేదని, ఒక వేళ ఏదైనా వస్తువు కనిపించకపోతే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? అసలు సంస్థను ఎలా నడపగలుగుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ప్రయాణికుల విషయంలో కూడా ఇలానే చేశారని, ఇదొక రకమైన వేధింపు అని సంస్థపై ఆమె మండిపడ్డారు. 

ఇది కూడా చూడండి:UCC: ఉత్తరాఖండ్‌ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే

Advertisment
తాజా కథనాలు