Cheating Case: రాజమౌళి 'SSMB29' పేరుతో రూ. 15.9 లక్షల మోసం! నిందితుడి కోసం పోలీసుల గాలింపు

'SSMB 29' సినిమా పేరుతో వరంగల్ కి చెందిన వ్యాపారికి రూ. 15.9 లక్షల టోపీ పెట్టాడు ఓ మోసగాడు. సినిమాలో ఆర్ట్ డిపార్మెంట్ మేనేజర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు లాగాడు. దీనిపై బాధితుడు వరంగల్ సైబర్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..

New Update
15 lakhs in the name of Rajamouli SSMB29 movie

15 lakhs in the name of Rajamouli SSMB29 movie

Cheating Case: సూపర్ స్టార్  మహేష్ బాబు, రాజమౌళి   ‘SSMB 29’  సినిమా పేరు చెప్పి ఓ వ్యాపారికి రూ. 15.9 లక్షలు టోపీ పెట్టాడు ఓ మోసగాడు. ప్రస్తుతం పోలీసులు ఆ మోసగాడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన వరంగల్ లో జరిగింది. వరంగల్ కి చెందిన 35ఏళ్ళ వ్యక్తి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ రన్ చేస్తున్నాడు. 

Also Read :  నా ఇష్టంతోనే చేశాను.. కమల్ హాసన్ తో లిప్ కిస్ పై నటి కామెంట్స్ వైరల్ !

15.9 లక్షల మోసం 

ఈ క్రమంలో వెంకటేష్ అనే వ్యక్తి తాను సినిమా యూనిట్ లో మేనేజర్ ని అంటూ అతడితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రాజమౌళి ‘SSMB 29’  సినిమాలో ఆర్ట్ డిపార్మెంట్ మేనేజర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని బాధితుడిని నమ్మబలికి మోసం చేశాడు. 2023లో మొదలైన ఈ వ్యవహారం 2025లో బయటపడింది. మొదట రూ. 15,000 రిజిస్ట్రేషన్ ఫీజు అడిగాడు. ఆ తర్వాత రకరకాల కారణాలు చెబుతూ పలు మార్లు డబ్బులు లాగడం మొదలు పెట్టాడు. పెద్ద నిర్మాణ సంస్థల అనుమతుల కోసం అంటూ మరోసారి  రూ. 40,000 నుంచి రూ. 80,000 డబ్బులు తీసుకున్నాడు. నకిలీ డాక్యుమెంట్లు, ఫేక్ ఈమెయిల్స్ చూపించి బాధితుడి దగ్గర నమ్మకాన్ని సంపాదించుకున్నాడు నిందితుడు వెంకటేష్. 

Also Read :  మాట్లాడుకోడాల్ లేవు.. పాకిస్తాన్‌కు తుపాకులతోనే సమాధానం చెప్తాం

88 ట్రాన్సాక్షన్ల 

నవంబర్ 21, 2024 నుంచి మార్చి 10, 2025 మధ్యకాలంలో మొత్తం 88 UPI ట్రాన్సాక్షన్ల ద్వారా బాధితుడు డబ్బులు చెల్లించాడు. ప్రతి లావాదేవీ రూ. 1,000 నుంచి రూ. 90,000 మధ్యలో ఉంది. మోసగాడు వేర్వేరు మొబైల్ నంబర్లకు, బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇలా మొత్తం రూ. 15.9 లక్షలు దోచుకున్నాడు. 

చివరికి ఈ మోసాన్ని పసిగట్టిన బాధితుడు వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో – వరంగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు నిందితుడు వెంకటేష్ పై BNS సెక్షన్ 318(4), 319(2), IT యాక్ట్ 66-C, 66-D సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని పట్టుకొనే ప్రయత్నంలో ఉన్నారు. అతడి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఈమెయిల్స్, కాల్ డేటా ఆధారంగా ట్రేస్ చేస్తున్నారు.  

Also Read: Miss World 2025: ప్రపంచం చూపులన్నీ HITEX మీదే! ఈరోజు గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఇవే

Also Read :  కవిత కొత్త జాగృతి ఆఫీసు ఎలా ఉందో చూశారా ?

Cyber Crime Fraud | SS Rajamouli | ssmb29-movie | cinema-news

Advertisment
Advertisment
తాజా కథనాలు