Actress Abhirami: 'థగ్ లైఫ్' ట్రైలర్ కమల్ హాసన్, నటి అభిరామి లిస్ లాక్ సీన్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిరామి దీనిపై స్పందించారు.
Also Read: Miss World 2025: ప్రపంచం చూపులన్నీ HITEX మీదే! ఈరోజు గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఇవే
నా ఇష్టంతోనే చేశాను..!
అభిరామి మాట్లాడుతూ.. ''చిత్రనిర్మాతల నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. ఆ సన్నివేశాన్ని నేను ఇష్టపూర్వకంగానే చేశాను. ఆ చిన్న క్లిప్ కారణంగా చాలా అపార్థాలు చోటుచేసుకున్నాయి.. కానీ పూర్తి సినిమా చూసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు మారుతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. సినిమా విడుదల తర్వాత దీని గురించి చర్చ కొనసాగదని అనుకుంటున్నాను. నిజానికి ఈ అంశంపై అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తీర్పులు ఇచ్చే ముందు అందరూ సినిమా చూడాలని నేను కోరుతున్నాను'' అంటూ ట్రోలర్లకు కౌంటర్ ఇచ్చింది అభిరామి.
Also Read : ఇదిరా పవర్ స్టార్ లుక్ అంటే.. ‘OG’ నుంచి కొత్త వీడియో అదిరిపోయిందెహే