/rtv/media/media_files/2025/10/30/rathika-ravinder-2025-10-30-12-04-40.jpg)
Rathika Ravinder
Rathika Ravinder: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తో ఫేమస్ అయిన రతిక రవీంద్ర, తన అందం, స్టైల్, వ్యక్తిత్వంతో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. షోలోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించి, తన లైఫ్‌స్టైల్, లుక్స్‌తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది.
‘ఎక్స్ వై (XY)’ అనే పాన్ ఇండియా మూవీ (XY Movie Motion Poster)
రతిక రవీంద్ర త్వరలోనే ‘ఎక్స్ వై (XY)’ అనే పాన్ ఇండియా మూవీ ద్వారా హీరోయిన్‌గా రాబోతోంది. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్‌లో టీ కప్పు, కెమెరా, మానవ మెదడు, డీఎన్ఏ, రాక్షస రూపం, గర్భంలో ఉన్న శిశువుల దృశ్యాలు లాంటి సైంటిఫిక్, మిస్టీరియస్ ఎలిమెంట్స్ చూపించి, కథను పూర్తి వివరించడం కాకుండా ఆసక్తిని రేకెత్తించింది.
#XY movie oda Title Look pic.twitter.com/QbQSo1H8es
— Dhanushksdurai Cinema Official (@dhanushksdurai) May 12, 2025
ఈ సినిమా దర్శకుడు, నిర్మాతగా సి.వి. కుమార్ వ్యవహరిస్తున్నారు. ఆయన ‘పిజ్జా’, ‘సూదు కవ్వుమ్’, ‘అట్టకత్తి’, ‘శరభం’, ‘ఇరుది సుట్రు’, ‘మాయవన్’ వంటి విభిన్న కథలతో ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నారు. ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో, సైంటిఫిక్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
‘ఎక్స్ వై’లో రతిక పాత్ర బలమైన ఎమోషన్స్, సైకాలజికల్ డెప్త్ కలిగిన రోల్‌గా ఉంటుంది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఈ సినిమాను
ఒకేసారి విడుదల చేయనున్నారు. సౌత్ ప్రేక్షకులు సైంటిఫిక్, థ్రిల్లర్స్ కి ఎక్కువ ఆసక్తి చూపించే కారణంగా, ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా అప్పుడే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ చర్చలు మొదలైనాయి. ఇప్పటికే మోషన్ పోస్టర్ ద్వారా అభిమానులలో గ్లామర్, మిస్టరీ, సైంటిఫిక్ ఎలిమెంట్స్ పై ఆసక్తి పెరిగింది. దీనివల్ల సినిమా రిలీజ్ పై ప్రేక్షకులలో హైప్ పెరిగిపోయింది.
మొత్తానికి, రతిక రవీంద్ర పాన్ ఇండియా హీరోయిన్ గా, కొత్త కాన్సెప్ట్, సైంటిఫిక్ ఎలిమెంట్స్‌తో ‘ఎక్స్ వై’లో ప్రేక్షకులను అలరిస్తోంది. సీన్స్, విజువల్స్, ఎమోషన్స్, మిస్టరీ కలిపి ఈ సినిమా థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి మరొక కొత్త అనుభవాన్ని అందించనుంది.
Follow Us