SSMB 29 UPDATE: మహేశ్ - రాజమౌళి మూవీ రేపే గ్రాండ్ లాంచ్..! మహేశ్ బాబు-రాజమౌళి కాంబో ‘SSMB29’ మూవీ లాంచ్‌కు టైం ఫిక్స్ అయింది. రేపు ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. ఇందులో ప్రియాంకచోప్రా హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. By Seetha Ram 01 Jan 2025 in సినిమా Latest News In Telugu New Update SSMB 29 UPDATE షేర్ చేయండి SSMB 29.. అందరి చూపు ఈ సినిమా పైనే ఉంది. ఇద్దరూ స్టార్లు కావడంతో ఎప్పుడుడెప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందా? అని ఓ వైపు మహేశ్ ఫ్యాన్స్, మరోవైపు రాజమౌళి ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వంద కాదు.. రెండు వందలు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. Also Read: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి! దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని నేషనల్ రేంజ్‌లో కాకుండా గ్లోబల్ రేంజ్‌లో అడ్వెంచర్ యాక్షన్ మూవీగా తెరకెక్కించబోతున్నాడు. దీంతో ఈ SSMB 29 చిత్రం ఎప్పుడు మొదలవుతుందా? అనే ఆసక్తి విపరీతంగా ఉంది. ఆర్ఆర్ఆర్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ఇప్పుడు మహేశ్ బాబు SSMB 29 చిత్రంతో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్లు గడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఈ సినిమా మొదలవుతుందా?.. మొదలైతే ఎప్పుడు మొదలవుతుంది అని అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ అప్డేట్ ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. Also Read: గతాన్ని మర్చిపోయి నన్ను క్షమించండి.. సీఎం వేడుకోలు! రేపే గ్రాండ్ లాంచ్ ఈ సినిమా లాంచ్‌కు డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రేపు (జనవరి 2)న ఈ చిత్రం గ్రాండ్ లెవెల్లో లాంచ్ అవుతుందని సమాచారం. ఉదయం పూజాకార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిఉంది. Also Read: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు మరోవైపు ఇంటర్నేషనల్ యాక్షన్- అడ్వెంచర్ గా రాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని భారతదేశం, అమెరికా, ఆఫ్రికన్ అటవీ ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నారు. 2026 చివరి వరకు ఈ సినిమా షూటింగ్ ఉంటుందని సమాచారం. Also Read: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ 2027లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే, హాలీవుడ్ సినిమాలతో పోటీగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది అతడి ప్లాన్. అందుకే ఇప్పట్నుంచే డిస్నీ, సోనీ లాంటి సంస్థలతో చర్చలు జరుపుతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రాను ఈ ప్రాజెక్టులోకి తీసుకోవడం మేకర్స్ కు కలిసొచ్చే అంశం. #latest-telugu-news #tollywood #rajamouli #ssmb-29-movie #mahesh-babu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి