/rtv/media/media_files/2025/02/05/5NXlqmMeVKP2icdSUP0O.jpg)
Anushka sharma
Hero Madhavan: హీరో మాధవన్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను కూడా ఏఐ టెక్నాలజీని(AI Technology) వల్ల మోసపోయినట్లు తెలిపారు. ఏఐ టెక్నాలజీ కారణంగా తనకు ఎదురైనా ఓ సంఘటనను పంచుకున్నారు.
అనుష్క శర్మ నుంచి మెసేజ్..
మాధవన్ మాట్లాడుతూ.. గతంలో ఓ సారి ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో(Cristiano Ronaldo) మన ఇండియన్ క్రికెటర్ కోహ్లీని ప్రశంసిస్తున్న వీడియోను చూశాను. అందులో రోనాల్డో కోహ్లీ అంటే తనకెంత ఇష్టం, అతని నాయకత్వపు లక్షణాల గురించి పొగుడుతూ మట్లాడారు. అది నాకెంతో నచ్చింది. వెంటనే ఆ వీడియోను నా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాను. ఆ తర్వాత కాసేపటికి నాకు అనుష్క శర్మ నుంచి మెసేజ్ వచ్చింది. అది రియల్ వీడియో కాదని.. AI టెక్నాలజీతో సృష్టించారని అనుష్క తెలిపింది. ఆ క్షణం నేను చాలా ఇబ్బందికి గురయ్యాను. టెక్నాలజీ పై అవగాహన ఉన్న నేను కూడా ఆ వీడియోను గుర్తించలేకపోయాను. సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్ ఏదైనా షేర్ చేసే ముందు నిజమా? కాదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Also Read: Thandel Movie: కెరీర్ లో హయ్యస్ట్ రెమ్యునరేషన్.. తండేల్ కోసం చై, పల్లవి ఎంత తీసుకున్నారంటే!
Bollywood Actor R Madhavan exposing Virat Kohli's PR 😭 pic.twitter.com/lNLeVNsqRq
— Aarchi (@Oye_Aarchi) February 3, 2025
మాధవన్ గతేడాది షైతాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం అదృష్టశాలి, ‘దే దే ప్యార్ దే 2, కేసరి చాప్టర్ 2, టెస్ట్, ధురందర్ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలన్నీ కూడా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటు కంగనా రనౌత్ తో మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: Siddhu: ఐదేళ్ల తర్వాత సిద్దూ మూవీ థియేటర్స్ లో.. ఆ స్పెషల్ డే రోజు రిలీజ్ ?
Also Read: Vijay-Rashmika: విజయ దేవరకొండతో రిలేషన్లో రష్మిక.. మరో సంచలన వీడియో!