krishna and his leela
Title endhuk marchamo adagakandi, It’s complicated anthe! Unexpected drama tho final ga theatres lo release avthundi ee Feb 14th ki. Catch us with your loved ones! Or two’s 😉#ItsComplicated #Starboy #FinallyIntheatres#SiddhuJonnalagadda @RanaDaggubati @ShraddhaSrinath… pic.twitter.com/vBOemAKPqD
— Rana Daggubati (@RanaDaggubati) February 3, 2025
ఇప్పుడు థియేటర్స్ లో
అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేసేందుకు నిర్ణయించారు నిర్మాత రానా దగ్గుబాటి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్స్ విడుదల కానుంది. ఈ సారి కొత్తగా 'ఇట్స్ కాంప్లికేటెడ్' అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రానా, సిద్ధూ జొన్నలగడ్డల ఓ సరదా సంబాషణతో ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ ఫీమేల్ లీడ్స్ గా నటించారు.
సినిమా స్టోరీ
కృష్ణ (సిద్దూ) తన స్నేహితురాలు సత్యతో( శ్రద్దా శ్రీనాథ్) ప్రేమలో పడతాడు. కానీ కొద్దిరోజులకు కొన్ని కారణాల చేత వారిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత సిద్దూ ఉద్యోగం బెంగళూరు వెళ్తాడు. అయితే అక్కడ మరో అమ్మాయి రాధ (షాలిని) తో పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా చిగురిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కథలోకి ఫస్ట్ లవర్ సత్య కృష్ణ లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. మరి కృష్ణ వారిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? వాళ్లకు నిజం తెలిసిన తర్వాత ఎమ్ జరిగింది? మరోవైపు కృష్ణకు రుక్సార్ అనే అమ్మాయితో ఉన్న సంబంధమేంటి? అనే అంశాలతో సినిమా ఆసక్తికరంగా ఉంటుంది.
Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్!