/rtv/media/media_files/2025/01/28/UtKjPSkV8XTepTJjWesT.jpg)
Naga Chaitanya, Sai Pallavi
Thandel Movie: చాలా గ్యాప్ తర్వాత అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'తండేల్'. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మత్స్యకారుల కథా నేపథ్యంలో రూపొందిన 'తండేల్' ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'తండేల్' పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి.
Also Read: Sai Pallavi: తండేల్ జాతర.. చైతన్యతో సాయి పల్లవి చిట్ చాట్.. చై కోసం పల్లవి ఇంట్రెస్టింగ్ పోస్ట్
కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్..
ఈ క్రమంలో తండేల్ చిత్రానికి నాగచైతన్య- సాయి పల్లవి తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. చై, పల్లవి తమ కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ఈ సినిమాకు తీసుకుంటున్నారట. నాగ చైతన్య రూ.15 కోట్లు తీసుకుంటుండగా.. సాయి పల్లవి రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో చై ఎప్పుడు కనిపించని విధంగా రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నారు. అచ్చం సముద్రంలో వేటకు వెళ్లే ఒక మత్స్యకారుడిగా అతడి లుక్ కనిపిస్తోంది.
Also Read: Life Style: పడుకునే ముందు వీటిలో ఒకటి తాగడం మర్చిపోవద్దు! ఎందుకంటే..
ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ పాటలు మరొక హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి. 'లవ్ స్టోరీ' తరువాత చై- పల్లవి కాంబోలో రాబోతున్న ఈమూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంన్నారు.
Also Read: Shraddha Kapoor: నేను అప్పుడే పెళ్లి చేసుకుంటా.. ? పెళ్లి పై శ్రద్ధ కపూర్ క్లారిటీ..! - Rtvlive.com