Vijay-Rashmika: విజయ దేవరకొండతో రిలేషన్లో రష్మిక.. మరో సంచలన వీడియో!

విజయ్ దేవరకొండ- రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ కలిసి మరోసారి కెమెరాకు చిక్కారు. ఇద్దరు ఒకే జిమ్ కి వెళ్లి తిరిగి వస్తూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

New Update
Vijay Devarakonda - Rashmika: "అవును ఇష్టపడుతున్నాను.. ప్రేమిస్తున్నాను".. విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్ పై రష్మిక షాకింగ్ కామెంట్స్..!

Vijay-Rashmika

Vijay-Rashmika:  టాలీవుడ్ స్టార్స్ రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నట్లు కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటివరకు వీరిద్దరూ దీని గురించి ఓపెన్ గా స్పందించకపోయినప్పటికీ.. పలు ఈవెంట్లలో, ఇంటర్వ్యూలలో వీరు చెప్పే సమాధానాలు మాత్రం అలాగే ఉన్నాయి. అంతేకాదు అప్పుడుడప్పుడు ఇద్దరు కలిసి ఒకే ఎయిర్ పోర్ట్ లో కనిపించడం, మ్యాచింగ్ డ్రెసులు వేసుకోవడం, పండగల సమయంలో విజయ్ ఇంట్లో రష్మిక ఉండడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. 

మరోసారి కెమెరాకు చిక్కిన విజయ్- రష్మిక 

ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ కలిసి మరోసారి కెమెరాకు చిక్కారు. విజయ్- రష్మిక ఇద్దరూ ఒకే జిమ్ నుంచి  వెళ్తూ కనిపించారు. విజయ్ కారులోనే రష్మిక వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

రీసెంట్ గా ఎయిర్ పోర్టులో 

రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో కూడా ఇద్దరు కలిసి కనిపించారు. ముందుగా రష్మిక అక్కడికి చేరుకొని ఫ్యాన్స్ తో ఫోటోలు దిగింది. అనంతరం కొద్ది సమయానికే విజయ్ కూడా అక్కడికి వచ్చారు. ఇద్దరు కలిసి క్రిస్మస్ వేడుకల కోసం విదేశాలకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. 

ఇది ఇలా ఉంటే ఇటీవలే రష్మిక జిమ్ లో వ్యాయామాలు చేస్తుండగా గాయపడింది. కాలు బెనకడంతో కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. కానీ తాను నటించిన బాలీవుడ్ చిత్రం  'చావా' రిలీజ్ కు ఉండడంతో గాయమైన కాలితోనే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు రష్మిక. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది.  

Also Read: Sai Pallavi: తండేల్ జాతర.. చైతన్యతో సాయి పల్లవి చిట్ చాట్.. చై కోసం పల్లవి ఇంట్రెస్టింగ్ పోస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు