పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న ‘OG’ సినిమా నుంచి అదిరిపోయే డైలాగ్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘వశీ యో వశీ’ అనే డైలాగ్ ఇప్పుడు సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం ఈ డైలాగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ డైలాగ్ జపనీస్ థీమ్‌తో కూడి ఉంది. పవన్ కల్యాణ్ ఈ డైలాగ్‌ను స్వయంగా ఆలపించడంతో అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది. పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్స్, జపనీస్ ఫైట్ థీమ్‌ను డైలాగ్‌లో అద్భుతంగా చూపించారు. డైలాగ్ మ్యూజిక్, విజువల్స్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్‌గా మారాయి.
WASHI YO WASHI
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎన్నో రోజుల నిరీక్షణకు ఈ డైలాగ్‌తో తెరపడింది. సుజీత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘They Call Him OG’ చిత్రం నుండి వచ్చిన ఈ అప్డేట్‌తో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఈ డైలాగ్‌తో పాటు పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, మ్యానరిజమ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ డైలాగ్ ట్రెండింగ్‌గా మారింది.
చిత్ర బృందం విడుదల చేసిన ఈ వీడియో గ్లింప్స్ సినిమాపై ఉన్న భారీ అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ‘ఓజాస్ గంభీరా’ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఇందులో మాస్ విలన్‌గా నటిస్తు్న్నాడు.
ప్రముఖ తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్, సునీల్, సుబ్బరాజు, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో పవన్ సరసన హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. ఈమె పాత్ర ‘కణ్మణి’ పేరుతో ఒక అమాయక, స్వీట్ గర్ల్‌గా ఉంటుంది. ఈ పాత్ర గంభీరా జీవితాన్ని మలుపు తిప్పేదిగా ఉంటుందని తెలుస్తోంది. సంగీత దర్శకుడిగా ఎస్. థమన్ మరోసారి తన అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.